అరకొరగానే : ఐఐటీ హైదరాబాద్‌కు రూ.80 కోట్లు

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌లోనూ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. తెలంగాణకు పెద్దగా ప్రయోజనం జరగలేదు. కేంద్రం అరకొరగానే

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 10:36 AM IST
అరకొరగానే : ఐఐటీ హైదరాబాద్‌కు రూ.80 కోట్లు

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌లోనూ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. తెలంగాణకు పెద్దగా ప్రయోజనం జరగలేదు. కేంద్రం అరకొరగానే

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌లోనూ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. తెలంగాణకు పెద్దగా ప్రయోజనం జరగలేదు. కేంద్రం అరకొరగానే నిధులు కేటాయించింది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్నోసార్లు పలు ప్రతిపాదనలు సమర్పించినా బడ్జెట్‌లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కనీసం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కూడా కేటాయించలేదు. మోడీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి కొత్త‌గా ఒక్క ప‌థ‌కం కూడా ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. ఆయా సంస్థలకు కేటాయించే నిధులు సైతం అరకొరగానే ఉండటం విశేషం. సింగరేణికి రూ.1,850 కోట్లు కేటాయించగా.. గిరిజన యూనివర్సిటీకి రూ.4 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.

 

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన నిధులు:
* ఐఐటీ హైదరాబాద్‌కి ‌ – రూ.80కోట్లు
* గిరిజన యూనివర్సిటీకి – రూ.4కోట్లు
* సింగరేణికి – రూ.1850 కోట్లు

 

తెలంగాణకు రావాల్సింది?
* తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్రం నుంచి నిధులు ఆశించింది.
* ఈ పథకాలకు కేంద్రం నిధులివ్వాలని నీతి ఆయోగ్ కూడా సిఫార్సు చేసింది.
* పోలవరం తరహాలో కాళేశ్వరం ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని, నిధులు ఇవ్వాలని డిమాండ్.
* విభజన హామీల్లో భాగంగా ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం, భూపాలపల్లి జిల్లా ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, ఒక ఉద్యాన విశ్వవిద్యాలయం రావాల్సి ఉంది.
* 2018 బడ్జెట్‌లో హైదరాబాద్ ఐఐటీకి రూ.75 కోట్లు ఇవ్వగా.. గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చారు.
* తెలంగాణలో 9 వెనుకబడిన జిల్లాలకు నిధులు ఆశించారు.