Russia-Ukraine Drone War : యుద్ధం తీవ్రతరం .. కామికాజి డ్రోన్లతో విరుచుకుపడతున్న రష్యా .. డర్టీ బాంబ్ ప్రయోగిస్తామంటున్న యుక్రెయిన్

రష్యా-యుక్రెయిన్ మధ్య నెలలుగా సాగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. రష్యా.. ఇటు యుక్రెయిన్.. సరికొత్త ఆయుధాలను వాడేందుకు కూడా వెనుకాడకపోవడం ఆందోళన రేపుతోంది.కామికాజి డ్రోన్లతో యుక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడుతోంది రష్యా..దీంతో యుక్రెయిన్ డర్టీ బాంబ్ ప్రయోగించే యోచనలోఉంది..

Russia-Ukraine Drone War : యుద్ధం తీవ్రతరం .. కామికాజి డ్రోన్లతో విరుచుకుపడతున్న రష్యా .. డర్టీ బాంబ్ ప్రయోగిస్తామంటున్న యుక్రెయిన్

Russia-Ukraine Drone War

Russia-Ukraine Drone War : రెండు దేశాల మధ్య తీవ్రమైన పరిస్థితులు తలెత్తినప్పుడు.. అవి యుద్ధానికి దారితీస్తాయ్. అలా మొదలైన యుద్ధం.. రోజురోజుకు తన పరిధిని పెంచుకుంటూ.. విధ్వంసాన్ని విస్తరించుకుంటూ ముందుకెళుతుంది. రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్ పరిస్థితి కూడా ఇదే. కొన్ని నెలలుగా సాగుతున్న యుద్ధం.. ఇప్పటికే పీక్‌కు చేరుకుంది. అటు రష్యా.. ఇటు యుక్రెయిన్.. సరికొత్త ఆయుధాలను వాడేందుకు కూడా వెనుకాడకపోవడం ఆందోళన రేపుతోంది.కామికాజి డ్రోన్లతో యుక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడుతోంది రష్యా..దీంతో యుక్రెయిన్ డర్టీ బాంబ్ ప్రయోగించే యోచనలోఉంది..

ఏదైనా సరే.. యుద్ధం మొదలవకముందే జరగాలి. ఒక్కసారి వార్ బెల్స్ మోగాక.. యుద్ధం మొదలయ్యాక.. దాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. ఇందుకు.. రష్యా-యుక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధమే పెద్ద ఎగ్జాంపుల్. 8 నెలలవుతున్నా.. వార్‌కి ఎండ్‌కార్డ్ పడట్లేదు. పైగా.. ప్రతి నెలలో దాడుల తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇప్పటికే.. రెండు దేశాల మధ్య యుద్ధం పీక్‌కు చేరింది. ఎంతలా అంటే.. అటు రష్యా.. ఇటు యుక్రెయిన్.. సరికొత్త ఆయుధాలను ప్రయోగించే దాకా వెళ్లాయ్ పరిస్థితులు. ఇప్పటిదాకా రెండు దేశాలు మిస్సైళ్లతోనే దాడులు చేసుకున్నాయ్. రష్యా అయితే.. వందలాది మిస్సైళ్లను ప్రయోగించింది. యుక్రెయిన్ కూడా రష్యా మిస్సైల్ దాడులను తిప్పికొట్టింది. ఇప్పుడిదే యుద్ధం.. మరింత ముదిరింది. కొత్త ఆయుధాలతో విరుచుకుపడేందుకు.. రెండు దేశాలు సిద్ధమయ్యాయ్.

కొద్దిరోజుల కిందట యుక్రెయిన్ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తిన్న రష్యా.. ఇటీవలే దాడులను తీవ్రతరం చేసింది. యుక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు అనేక నగరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. అప్పటి నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయ్. తాజా దాడుల్లో.. రష్యా సొంత క్షిపణులతో పాటు ఇరాన్‌లో తయారైన కామికాజి డ్రోన్లను కూడా వినియోగిస్తున్నట్లు యుక్రెయిన్ చెబుతోంది. వారం రోజులుగా కామికాజి డ్రోన్ల విషయంలో యుక్రెయిన్ పదే పదే రష్యాపై ఆరోపణలు గుప్పిస్తోంది. అమెరికా సహా ఇతర దేశాలన్నీ ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ్. ఈ యుద్ధంలో కామికాజి డ్రోన్ల వాడకం మీదే పెద్ద రచ్చ నడుస్తోంది. ఎందుకంటే.. అవి సూసైడ్ డ్రోన్స్.

India-UK FTA..PM Rishi Sunak : భారత్-బ్రిటన్ మధ్య పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఆశలు ..ఆ దిశగా రిషి సునక్ చొరవ తీసుకుంటారా?

కామికాజి డ్రోన్లకు.. మిగతా డ్రోన్లకు చాలా తేడా ఉంది. సాధారణ డ్రోన్లు.. మిస్సైళ్లను మోసుకెళ్లి.. టార్గెట్‌పై ఫైర్ చేయగానే.. తిరిగి తమ స్థానానికి చేరుకుంటాయ్. కానీ.. కామికాజి డ్రోన్లు అలా కాదు. ఇవి.. ఆత్మాహుతి డ్రోన్లు. మిస్సైళ్లను మోసుకెళ్లడంతో పాటు నేరుగా టార్గెట్ మీదకు దూసుకెళ్లి నాశనం చేస్తాయ్. అక్కడే నాశనమైపోతాయ్. అందుకే.. వీటిని సూసైడ్ డ్రోన్స్ అని పిలుస్తారు. ఇప్పుడు.. వీటినే రష్యా తమ మీద ప్రయోగిస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించొచ్చు. కానీ.. అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అదే.. కామికాజి డ్రోన్లైతే.. చిన్నవిగా ఉంటాయ్. తక్కువ ధరలో వస్తాయ్. పైగా.. టార్గెట్లను కచ్చితత్వంతో నాశనం చేస్తాయ్. అందుకే.. రష్యా వాటిని సెలక్ట్ చేసుకుంది.

కామికాజి డ్రోన్లతో యుక్రెయిన్ పై విరుచుకుపడతున్న రష్యా..
కామికాజి డ్రోన్లకు.. ఇరాన్ షహీద్ డ్రోన్లు అని పేరు పెట్టింది. రష్యా వాటినే జెరాన్‌-2గా పిలుస్తోంది. 40 కిలోల పేలోడ్‌తో.. వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను కూడా ఈ కామికాజి డ్రోన్లు ఛేదించగలవు. అయితే.. యుక్రెయిన్‌పై దాడికి తక్కువ దూరంలోనే వీటిని వాడుతున్నారు. దీని సైజ్ చిన్నదిగా ఉండటంతో.. గాల్లోనే గుర్తించి కూల్చేయడం కష్టంగా మారింది. ఈ డ్రోన్లు.. కేవలం 40 మీటర్ల ఎత్తులోనే ప్రయాణించగలవు. దీంతో.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లకు, భూమిపై ఉండే రాడార్లకు.. వీటిని దూరం నుంచి గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ ఆత్మాహుతి డ్రోన్లను ఒకేసారి పదుల సంఖ్యలో ప్రయోగిస్తే.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిలువరించలేదు. పైగా.. చౌకగా దొరికే ఈ డ్రోన్లను కూల్చాలంటే.. ఖరీదైన మిస్సైళ్లను ప్రయోగించాల్సి ఉంటుంది. జావెలిన్ లాంటి ఆయుధాలతో కూల్చడం కూడా కష్టమే. షహీద్ డ్రోన్లను కూల్చాలంటే.. రాడార్ గైడెడ్ గన్స్‌ని వాడాల్సి ఉంటుంది. కానీ.. యుక్రెయిన్ దగ్గర ఈ రకం వెపన్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. రష్యా మాత్రం.. తక్కువ ఖర్చుతో.. యుక్రెయిన్‌లో ఎక్కువ విధ్వంసం సృష్టించొచ్చనే ఆలోచనతోనే.. షహీద్ డ్రోన్లను ప్రయోగిస్తోంది.

మిస్సైళ్లు, డ్రోన్లు, ఇతర ఆయుధాల సరఫరాపై ఇటీవలే రష్యా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినట్లు వార్తలొచ్చాయ్. ఇరాన్ సప్లై చేస్తున్న వాటిలో షహీద్ డ్రోన్లు, ఫతే-110, జోల్ఫాఘర్ 300కేఎం, 700కేఎం బాలిస్టిక్ మిస్సైళ్లు ఉన్నాయ్. ఇటీవల.. యుక్రెయిన్‌పై షహీద్-136 డ్రోన్లతో రష్యా దాడులు చేసింది. అయితే.. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం.. రష్యాకు తాము డ్రోన్లు, ఇతర ఆయుధాలు సప్లై చేయలేదని చెబుతోంది. మాస్కో కూడా.. తమ బలగాలు ఇరాన్ డ్రోన్లను వాడలేదని తెలిపింది. కానీ.. ఇరాన్ నుంచి సుమారు 2 వేల 4 వందల కామికాజి డ్రోన్లకు.. రష్యా ఆర్డర్ ఇచ్చిందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. తమ దేశంలోని ఇంధన సంస్థలు, కీలకమైన కార్యాలయాలపై దాడులకు కామికాజి డ్రోన్లను వాడుతున్నారని జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. రష్యా డ్రోన్ దాడుల కారణంగా.. యుక్రెయిన్‌కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను సప్లై చేయాలని.. అమెరికాతో పాటు దాని మిత్రదేశాలు నిర్ణయించాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

డర్టీ బాంబ్‌ అంటే ఏమిటి..?
మామూలు పేలుడు పదార్థాలతో పాటు అణుధార్మిక పదార్థాలు కూడా కలిపి ఉండే బాంబునే.. డర్టీగా బాంబుగా పిలుస్తారు. ఇందులో.. సంప్రదాయ పేలుడు పదార్థాలతో పాటు యురేనియం కూడా కలిపి ఉంటుంది. అది పేలినప్పుడు.. వాటితో పాటు ఉన్న అణుధార్మిక పదార్థం గాలిలో వ్యాపిస్తుంది. ఈ డర్టీ బాంబ్ తయారీకి.. న్యూక్లియర్ బాంబుల్లో ఉపయోగించే తరహా.. అత్యంత శుద్ధి చేసిన అణుధార్మిక పదార్థం అవసరం లేదు. ఆస్పత్రులు, అణు విద్యుత్ ప్లాంట్లు, రీసెర్చ్ లేబోరేటరీల్లో ఉండే అణుధార్మిక పదార్థాలను వాడి.. డర్టీ బాంబ్‌ని తయారుచేస్తారు. అణ్వాయుధాల కన్నా చాలా చౌకగా.. చాలా వేగంగా.. దీనిని తయారుచేయొచ్చు. వాహనాల్లోనూ తీసుకెళ్లొచ్చు.