Vivo X90 Series : వివో నుంచి X90 సిరీస్ వస్తోంది.. గ్లోబల్ లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు లీక్..!

Vivo X90 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ Vivo X90 సిరీస్ త్వరలో మార్కెట్‌లోకి లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. Vivo X90 సిరీస్ నవంబర్ 22న చైనాలో లాంచ్ అవుతుందని స్మార్ట్‌ఫోన్ ధృవీకరించింది. వివో X90 సిరీస్ Vivo కెమెరా-ఫోకస్డ్ X80 సిరీస్‌కి వెర్షన్.

Vivo X90 Series : వివో నుంచి X90 సిరీస్ వస్తోంది.. గ్లోబల్ లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు లీక్..!

Vivo X90 Series Complete Specifications leak ahead of global launch

Vivo X90 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ Vivo X90 సిరీస్ త్వరలో మార్కెట్‌లోకి లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. Vivo X90 సిరీస్ నవంబర్ 22న చైనాలో లాంచ్ అవుతుందని స్మార్ట్‌ఫోన్ ధృవీకరించింది. వివో X90 సిరీస్ Vivo కెమెరా-ఫోకస్డ్ X80 సిరీస్‌కి వెర్షన్. వివో X90 సిరీస్ కెమెరా స్పెక్స్, ఇంటీరియర్‌లతో వస్తుందని భావిస్తున్నారు. టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ Vivo X90 సిరీస్ ఫుల్ స్పెసిఫికేషన్‌లను షేర్ చేశారు. వివో X90 సిరీస్‌లో Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro ప్లస్‌లతో సహా 3 ఫోన్‌లు ఉంటాయని టిప్‌స్టర్ వెల్లడించారు. వివో X90 ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

Vivo X90 Series :
టిప్‌స్టర్ అగర్వాల్ ప్రకారం.. Vivo X90 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్ప్లే 2800×1260 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. Vivo X90 డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌తో పాటు LPDDR5 ర్యామ్, UFS4.0 స్టోరేజ్‌తో ఉంటుందని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ Android 13 ఆధారంగా OriginOS 3లో రన్ అవుతుంది. కెమెరా విభాగంలో Vivo X90 IMX866 50MP f/1.75 ప్రైమరీ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో 12MP f/2.0 పోర్ట్రెయిట్ సెన్సార్, 12MP f/2.0 అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ డివైజ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4,810mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని బరువు 195 గ్రాములు, కొలతలు 164×74.4×8.8mm ఉంటుంది.

Vivo X90 Series Complete Specifications leak ahead of global launch

Vivo X90 Series Complete Specifications leak ahead of global launch

Vivo X90 Pro :
Vivo X90 Pro 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 2800×1260 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌తో పాటు LPDDR5 RAM, UFS4.0 స్టోరేజ్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ OriginOS 3లో రన్ అవుతుంది. కెమెరా విభాగంలో Vivo X90 Pro ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో IMX866 50MP f/1.75 ప్రైమరీ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP f/1.6 పోర్ట్రెయిట్ సెన్సార్, 12MP f/2.0 అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,870 mAh బ్యాటరీతో బ్యాకప్ అందిస్తుంది.

Vivo X90 Series Complete Specifications leak ahead of global launch

Vivo X90 Series Complete Specifications leak ahead of global launch

Vivo X90 Pro Plus :
Vivo X90 Pro+ 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. డిస్ప్లే 2800×1260 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ LPDDR5X RAM, UFS4.0 స్టోరేజ్‌తో వచ్చిన డైమెన్సిటీ 9200 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. Vivo X90 Pro+ Android 13 పైన OriginOS 3పై రన్ అవుతుంది. కెమెరా విభాగంలో Vivo X90 Pro+ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో IMX989 50MP f/1.75 ప్రైమరీ సెన్సార్, IMX758 50MP f/.6 పోర్ట్రెయిట్ సెన్సార్, IMX598 48MP f/2.2 అల్ట్రావైడ్ సెన్సార్, OV64MP f40 ఉంటాయి. 3.5 టెలిఫోటో సెన్సార్‌తో రానుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంద. స్మార్ట్‌ఫోన్‌కు 80W వైర్‌తో కూడిన 4,700mAh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది. 50W వైర్‌లెస్ ఛార్జింగ్ డివైజ్‌కు సపోర్టు ఇస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vivo V25 4G వేరియంట్ లాంచ్ అప్పుడే.. Vivo V25e ఫీచర్లతోనే రావొచ్చు.. ధర ఎంత ఉండొచ్చుంటే?