Vivo V25 4G వేరియంట్ లాంచ్ అప్పుడే.. Vivo V25e ఫీచర్లతోనే రావొచ్చు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo V25 4G Variant : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC ద్వారా ఆధారితమైన Vivo V25 5G గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ త్వరలో హ్యాండ్‌సెట్ 4G వెర్షన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Vivo V25 4G వేరియంట్ లాంచ్ అప్పుడే.. Vivo V25e ఫీచర్లతోనే రావొచ్చు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo V25 4G Variant Launch Timeline Tipped, May Include Same Features as Vivo V25e

Vivo V25 4G Variant : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC ద్వారా ఆధారితమైన Vivo V25 5G గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ త్వరలో హ్యాండ్‌సెట్ 4G వెర్షన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అధికారికంగా బ్రాండ్ ద్వారా వెరిఫై చేయలేదు. లేటెస్ట్ లీక్ ప్రకారం.. నవంబర్ మధ్య నాటికి భారత్‌లో Vivo V25 4G అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. Vivo V25 4G స్పెసిఫికేషన్‌లు ఆగస్ట్‌లో గ్లోబల్ మార్కెట్‌లలో Vivo V25e 4G మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు.

టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ (@PassionateGeekz), ప్రైస్‌బాబాతో కలిసి Vivo V25 4G ఇండియా లాంచ్ వివరాలను సూచించింది. నివేదిక ప్రకారం.. Vivo V25 4G వెర్షన్ నవంబర్ మధ్య నాటికి భారత మార్కెట్లోకి రానుంది. Vivo V25 4G స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లను Vivo V25e మాదిరిగానే ఉంటాయి. Vivo కలర్ ఆప్షన్ల కోసం వివిధ మార్కెటింగ్ పేర్లను ఉపయోగించవచ్చు.

Vivo V25 4G Variant Launch Timeline Tipped, May Include Same Features as Vivo V25e

Vivo V25 4G Variant Launch Timeline Tipped, May Include Same Features as Vivo V25e

Vivo V25 5G భారత్‌లో ఎలిగెంట్ బ్లాక్, సర్ఫింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. భారత్‌లో దీని ధర రూ. 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ కోసం 27,999, రూ. 12GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ కోసం 31,999గా ఉంది. Vivo V25e సింగిల్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం MYR 1,399 (దాదాపు రూ. 24,900) ధర ట్యాగ్‌తో ఈ ఏడాది ఆగస్టులో మలేషియాలో లాంచ్ అయింది. డైమండ్ బ్లాక్, సన్‌రైజ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది.

Vivo V25e Android 12-ఆధారిత Funtouch OS 12పై రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44-అంగుళాల Full-HD+ (1,080 x 2,404) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 8GB RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoC ద్వారా పవర్ అందిస్తుంది.

Vivo V25 4G Variant Launch Timeline Tipped, May Include Same Features as Vivo V25e

Vivo V25 4G Variant Launch Timeline Tipped, May Include Same Features as Vivo V25e

మరోవైపు Vivo V25 5G మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoCని కలిగి ఉంది. 64-MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ముందువైపు 32-MP సెల్ఫీ కెమెరా సెన్సార్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా అందిస్తోంది. Vivo V25e 4,500mAh బ్యాటరీని అందిస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Amazon Smartphone Days Sale : అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్.. ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!