Update your WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఈ కొత్త ఫీచర్లను పొందాలంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!

Update your WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) టాప్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా iOS, Androidలో 2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది.

Update your WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఈ కొత్త ఫీచర్లను పొందాలంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!

Update your WhatsApp to use these amazing recently launched features

Update your WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) టాప్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా iOS, Androidలో 2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. యూజర్ ఇంటర్‌ఫేస్, ప్రైవసీని మెరుగుపర్చేందుకు వాట్సాప్ తమ iOS, Android, వెబ్ యూజర్ల కోసం ప్రతి నెలా కొత్త ఫీచర్‌లను ప్రవేశపెడుతోంది. ఇటీవలే వాట్సాప్ అనేక ఫీచర్‌లను రిలీజ్ చేసింది. అందులో Message Yourself, Chatlist filters, WhatsApp Polls, WhatsApp Avatars, Display profile pictures in group, Call Link Feature, Link previews on Status, Features for Group admins, Undo Delete for Me, Status Reactions వంటి కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది.

ఈ కొత్త ఫీచర్లను యాక్సస్ చేసుకోవాలంటే వాట్సాప్ యూజర్లు తమ యాప్ వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది. ఈ అప్‌డేట్‌లు iOS, Android, వెబ్ యాప్ యూజర్లక అందరికి అందుబాటులోకి వచ్చాయి. యాప్ స్టోర్ (App Store) లేదా ప్లే స్టోర్‌ (Play Store)లో అప్‌డేట్ చేసిన అప్లికేషన్ అప్‌డేట్ వెర్షన్‌తో అందుబాటులో ఉన్న కొన్ని కొత్త వాట్సాప్ ఫీచర్‌లను నిశితంగా పరిశీలిద్దాం. మీరు మీ డివైజ్‌లో ఈ ఫీచర్‌లను గుర్తించలేకపోతే.. మీ యాప్‌లను అప్‌డేట్ చేయండి లేదా కొన్ని రోజులు వేచి ఉండండి. ఎందుకంటే త్వరలో అన్ని iOS, Android, WhatsApp Web వినియోగదారులకు అందుబాటులోకి ఉంటాయి. వాట్సాప్ అందించే కొత్త ఫీచర్లు ఏయే రిలీజ్ అయ్యాయో ఓసారి చూద్దాం..

Message Yourself :

ఈ కొత్త ఫీచర్ మీ సొంత ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. మీరు మీ ముఖ్యమైన నోట్స్ లేదా మీడియాను సేవ్ చేయవచ్చు. ఈ Message Yourself ఫీచర్ సాయంతో మీ చాట్‌లోని మీడియా, చాట్‌లు, లింక్ చేసిన అన్ని డివైజ్‌‌లకు పంపుకోవచ్చు. తద్వారా మీరు వాటిని అన్ని డివైజ్‌ల్లో ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు.

Update your WhatsApp to use these amazing recently launched features

Update your WhatsApp to use these amazing recently launched features

మీకు మీరే మెసేజ్ పంపాలంటే..
* WhatsApp తెరవండి
* కాంటాక్టులకు వెళ్లండి.
* మీ కాంటాక్టుల లిస్టు పైభాగంలో మీ పేరును టెక్స్ట్‌తో చూడవచ్చు.
* మెసేజ్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి.
సాధారణ చాట్ మాదిరిగానే చాట్ విండో ఓపెన్ అవుతుంది. మీరు ఇతర WhatsApp చాట్ విండోలలో చేసినట్లుగా మీరు మీడియా, మెసేజ్ సహా ఏదైనా పంపవచ్చు.

Chatlist Filters :

WhatsApp చాట్‌లిస్ట్ ఫిల్టర్‌లు ఇప్పుడు నిర్దిష్ట సందేశాలను లేదా కాంటాక్టుల నుంచి మీడియాను త్వరగా చదవని అన్ని మెసేజ్‌లను ఫిల్టర్ చేసేందుకు చాట్ లిస్టును సెర్చ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. ఫిల్టర్ ఐకాన్, iPhoneలు, Android ఫోన్‌లు లేదా WhatsApp వెబ్‌లో సెర్చ్ బాక్స్ సమీపంలో అందుబాటులో ఉంటుంది.

UnRead చాట్‌లను ఫిల్టర్ చేయాలంటే..
* Search Box పక్కన అందుబాటులో ఉన్న Filter iconపై Tap చేయండి.
* Unread మెసేజ్, ఫోటోల లింక్‌ల డాక్యుమెంట్లు అన్నింటితో సహా ఫిల్టర్ ఆప్షన్ ఎంచుకోండి.

Read Also : iPhone Users on WhatsApp : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్ మాట్లాడుతూనే మల్టీ టాస్క్ చేసుకోవచ్చు..!

WhatsApp Polls :

WhatsApp పోల్స్ వినియోగదారులు వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌లలో ప్రశ్నలు అడగవచ్చు. రియల్ టైమ్ సమాధానాలను కూడా పొందవచ్చు. మీ పోల్‌లో యూజర్లు ఒక ప్రశ్న కింద గరిష్టంగా 12 ఆప్షన్లను యాడ్ చేయవచ్చు.

పోల్‌ను క్రియేట్ చేయాలంటే :
* ఏదైనా వ్యక్తిగత లేదా గ్రూప్ WhatsApp చాట్‌ని ఓపెన్ చేయండి.
* అటాచ్‌మెంట్ ఐకాన్ > పోల్ > పోల్‌ క్రియేట్‌పై నొక్కండి.
* Ask Questionపై నొక్కి మీ ప్రశ్నను ఎంటర్ చేయండి.
* ఆ తర్వాత, మీ పోల్ ఆప్షన్లను నమోదు చేయండి.
* మీరు ఆర్డర్‌ను క్రమాన్ని మార్చడానికి ఆప్షన్లను క్లిక్ చేసి డ్రాగ్ చేయవచ్చు.
* మీ పోల్‌ని క్రియేట్ చేయడానికి పంపడానికి Send iconపై క్లిక్ చేయండి.

WhatsApp Avatars :

మెటా వాట్సాప్ కోసం కొత్త అవతార్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు, వాట్సాప్ వినియోగదారులు తమ సొంత అవతార్‌ని క్రియేట్ చేసి ప్రొఫైల్ పిక్చర్‌గా సెట్ చేసుకోవచ్చు లేదా అవతార్ స్టిక్కర్‌లను ఇతరులకు పంపుకోవచ్చు.

Update your WhatsApp to use these amazing recently launched features

Update your WhatsApp to use these amazing recently launched features

Display profile pictures in group :

ఈ కొత్త అప్‌డేట్ ఇప్పుడు వినియోగదారులకు గ్రూపు సభ్యులను గుర్తించడాన్ని సులభతరం చేస్తుంది. ఇప్పుడు వినియోగదారులు టెక్స్ట్ బబుల్‌తో కలిసిన గ్రూపులో పాల్గొనేవారి ఫొటోను చూడవచ్చు.

Call Link Feature :

వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు కాల్స్ ట్యాబ్ నుంచి WhatsApp కాల్ లింక్‌ని క్రియేట్ చేసి ఎవరికైనా పంపవచ్చు. తద్వారా వ్యక్తిగత లేదా గ్రూపు చాట్‌ల నుంచి ఇతర వ్యక్తులు లింక్ నుంచి నేరుగా కాల్‌లో జాయిన్ కావొచ్చు.
* WhatsApp ఓపెన్ చేసి కాల్స్ ట్యాబ్‌పై నొక్కండి
* ఇప్పుడు క్రియేట్ కాల్ లింక్‌పై Tap చేయండి.
* మీ కాల్ టైప్, వీడియో లేదా వాయిస్‌ని ఎంచుకోండి.
* షేర్ లింక్ లేదా కాపీ లింక్‌పై Tap చేయండి.
* వాట్సాప్‌లో లేదా ఏదైనా ఇతర యాప్‌లో పంపండి.
* కాల్ లింక్‌ను Tap చేయడం ద్వారా కొనసాగుతున్న కాల్‌లో జాయిన్ కావొచ్చు.

Link previews on Status :

WhatsApp ఇప్పుడు టెక్స్ట్ స్టేటస్‌గా షేర్ చేసిన లింక్‌ల రిచ్ ప్రివ్యూలను చూపిస్తుంది. ప్రివ్యూ లింక్‌లో ఉన్న వాటికి మరిన్ని వివరాలను వెంటనే యాడ్ చేస్తుంది.

ఈ ఫీచర్ ఎలా వాడాలంటే? :
* WhatsApp ఓపెన్ చేయండి.
* మీ స్టేటస్ ట్యాప్‌ని ఓపెన్ చేసి Status క్రియేట్ చేయండి.
* మీరు Share చేయాలనుకుంటున్న లింక్‌ను స్టిక్ చేయండి.
* ఇప్పుడు ప్రివ్యూ జనరేట్ అయ్యే వరకు వేచి ఉండండి.
* Status భాగస్వామ్యం చేయండి.

Features for Group admins :

ఇప్పుడు, ఎవరైనా గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే గ్రూప్ అడ్మిన్‌లకు మాత్రమే తెలుస్తుంది.  గ్రూప్ అడ్మిన్‌లు ఇప్పుడు గ్రూప్ పార్టిసిపెంట్‌ల మెసేజ్‌లు అనుచితంగా లేదా అభ్యంతరకరంగా అనిపిస్తే వాటిని తొలగించవచ్చు. మెసేజ్‌ని ఎవరు తొలగించారో అందరూ పాల్గొనే వారూ చూడవచ్చు. WhatsApp గ్రూపు లిమిట్ 512కి పెంచింది. త్వరలో 1024 మంది యూజర్లను పాల్గొనే ఫీచర్ యాడ్ చేయనుంది.

Undo Delete for Me :

వాట్సాప్ ఇప్పుడు ‘డిలీట్ ఫర్ మి’ మెసేజ్ కొన్ని సెకన్లలో క్యాన్సిల్ చేయడానికి యూజర్లకు అనుమతిస్తుంది. మీరు Delete for Everyoneకి బదులుగా ‘Delete For Me’ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే Delete for Me మెసేజ్‌ని రికవర్ చేయవచ్చు. అయితే, వాట్సాప్ చాట్‌లో మీరు పొరపాటున డిలీట్ చేసిన మెసేజ్ చెక్ చేయండి. మీకు ‘Undo ఆప్షన్ కనిపిస్తుంది. ‘Undo’ ఆప్షన్‌పై Tap చేయండి. మీ మెసేజ్ రీస్టోర్ అవుతుంది.

Status Reactions :
Instagram, Facebook మాదిరిగానే WhatsApp వినియోగదారులు ఇప్పుడు స్క్రీన్‌పై 8 ఎమోజి ఆప్షన్లతో స్టేటస్‌పై నేరుగా స్పందించవచ్చు.
* Status ఓపెన్ చేయండి.
* Reply ఎంపికపై నొక్కండి లేదా Statusపై స్వైప్ చేయండి
* మీరు ఎమోజి Reply చూడొచ్చు.
* మీకు నచ్చిన వాటిని Tap చేసి ఇతరులకు పంపండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Avatars : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. మీరే అవతార్ క్రియేట్ చేసి ఎవరికైనా పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!