WhatsApp Avatars : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. మీరే అవతార్ క్రియేట్ చేసి ఎవరికైనా పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Avatars : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్‌లను లాంచ్ చేస్తూనే ఉంది. వాట్సాప్ లేటెస్ట్‌గా అవతార్‌లను క్రియేట్ చేసుకోనే అవకాశం కల్పిస్తోంది.

WhatsApp Avatars : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. మీరే అవతార్ క్రియేట్ చేసి ఎవరికైనా పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Avatars _ WhatsApp now lets you create and send Avatars, here is how

WhatsApp Avatars : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్‌లను లాంచ్ చేస్తూనే ఉంది. వాట్సాప్ లేటెస్ట్‌గా అవతార్‌లను క్రియేట్ చేసుకోనే అవకాశం కల్పిస్తోంది. యూజర్లు తమ భావోద్వేగాలను, భావాలను తెలియజేసేందుకు అవతార్‌లు సాయపడతాయని ప్లాట్‌ఫారమ్ సూచిస్తోంది. అయితే మెసేజింగ్ యాప్‌లో సొంత అవతార్‌ని క్రియేట్ చేయవచ్చు. కంపెనీ అందించిన 36 కస్టమ్ స్టిక్కర్‌లలో దేనినైనా ఉపయోగించవచ్చు. యాప్‌లో మరిన్ని స్టైల్స్ యాడ్ చేస్తోంది.

ఈ మేరకు వాట్సాప్ బ్లాగ్ పోస్ట్‌లో ధృవీకరించింది. వీటిలో లైటింగ్, షేడింగ్, హెయిర్ స్టయిల్ టెక్సటర్లు మరిన్ని ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే అన్ని డివైజ్‌లకు అప్‌డేట్‌ను ప్రారంభించింది. అంటే రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి రానుంది. WhatsAppకు కొత్త అవతార్‌లను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు మీరు చాట్‌లలో మీ అవతార్‌ను స్టిక్కర్‌గా ఉపయోగించవచ్చు. వాట్సాప్ సహా అన్ని యాప్‌లలో మరిన్ని స్టైల్స్ త్వరలో వస్తాయని Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ Facebookలో ప్రకటించారు.

Read Also : WhatsApp Lucky Users : వాట్సాప్‌లో కొంతమంది యూజర్లకు లక్కీ ఛాన్స్.. సింగిల్ అకౌంట్‌ను రెండు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో వాడొచ్చు..!

వాట్సాప్‌లో అవతార్‌లను ఎలా క్రియేట్ చేయాలి? ఎలా పంపాలంటే?

Step -1 : వాట్సాప్ యూజర్ చాట్‌లో అవతార్‌ను షేర్ చేస్తే.. యూజర్లు సెట్టింగ్‌ల సెక్షన్లలో సెర్చ్ చేయడానికి బదులుగా ఫీచర్‌ను యాక్సెస్ చేసేందుకు దానిపై Tap చేయవచ్చు. వాట్సాప్ యాప్ కొత్త ఫీచర్ గురించి అన్ని వివరాలను, మీరు మెసేజింగ్ యాప్ దిగువన ఉన్న గెట్ స్టార్ట్ బటన్‌పై Tap చేయాలి. అప్పుడు మీరు మీ అవతార్ కోసం స్కిన్ టోన్‌ని ఎంచుకునేందుకు ఒక ఆప్షన్ పొందవచ్చు. వాట్సాప్ అవతార్‌ను కేశాలంకరణ, దుస్తులతో పాటు ఇతర వస్తువులతో క్రియేట్ చేసుకోవచ్చు.

WhatsApp Avatars _ WhatsApp now lets you create and send Avatars, here is how

WhatsApp Avatars _ WhatsApp now lets you create and send Avatars, here is how

Step -2 : మెసేజింగ్ యాప్‌లోని సెట్టింగ్‌ల విభాగంలో ఈ ఫీచర్ కనిపిస్తుంది. యూజర్లు WhatsAppలో Settings menu > Tap on Avatar > Create Your Avatar మీరు అవతార్‌ని క్రియేట్ చేసేందుకు కొన్ని ఆప్షన్లను పొందవచ్చు. మీరు ఆయా దశలను పూర్తి చేసి, ఆపై “Done” బటన్‌పై Tap చేయండి. అవతార్‌ను క్రియేట్ చేసే ప్రక్రియను పూర్తి చేయండి. మీరు ఏదైనా చాట్‌లోని ఎమోజి సెక్షన్లలో అవతార్ సెక్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతం, వాట్సాప్‌లో ఎమోజీలు, GIFలు, స్టిక్కర్‌లను మాత్రమే చూపిస్తుంది. ఇకపై యూజర్లు అవతార్‌లను కూడా షేర్ చేయవచ్చు.

వాట్సాప్‌లో అవతార్‌ని ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించడం సాధ్యమేనా?
వాట్సాప్ మీ అవతార్‌ను ప్రొఫైల్ పిక్చర్‌గా సెట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది. Settings > Profile photo > Edit > Edit > Use Avatarపై ట్యాప్ చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Chat Filter : వాట్సాప్‌ చాట్ లిస్టులో మీరు చూడని మెసేజ్‌లను ఈజీగా ఇలా ఫిల్టర్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!