WhatsApp Lucky Users : వాట్సాప్‌లో కొంతమంది యూజర్లకు లక్కీ ఛాన్స్.. సింగిల్ అకౌంట్‌ను రెండు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో వాడొచ్చు..!
వాట్సాప్ (Whatsapp) కొంతమంది యూజర్లు తమ అకౌంట్‌ను ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. BGR నివేదిక ప్రకారం.. ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ బీటా టెస్టర్‌లు వారి WhatsApp అకౌంట్‌ను రెండవ డివైజ్‌తో అంటే టాబ్లెట్‌తో లింక్ చేసేందుకు అనుమతిస్తుంది.

WhatsApp Lucky Users : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) కొంతమంది యూజర్లు తమ అకౌంట్‌ను ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. BGR నివేదిక ప్రకారం.. ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ బీటా టెస్టర్‌లు వారి WhatsApp అకౌంట్‌ను రెండవ డివైజ్‌తో అంటే టాబ్లెట్‌తో లింక్ చేసేందుకు అనుమతిస్తుంది.
వాట్సాప్ టాబ్లెట్ వెర్షన్‌తో తమ అకౌంట్ లింక్ చేయమని బీటా ఛానెల్‌లోని యూజర్లను వాట్సాప్ అలర్ట్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. WhatsApp బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ అయిన Android యూజర్లు Android టాబ్లెట్ కలిగి ఉన్నారా? టాబ్లెట్ కోసం WhatsApp బీటా టెస్టులకు అందుబాటులో ఉంది. బ్యానర్‌పై ట్యాప్ చేయడం ద్వారా స్క్రీన్ దిగువన పాప్-అప్ ఓపెన్ అవుతుంది. WhatsApp అకౌంట్ టాబ్లెట్ వెర్షన్‌తో కనెక్ట్ చేసేందుకు ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
– ఇన్‌స్టాల్‌పై Click చేయండి. ఇప్పటికే డౌన్‌లోడ్ అయి ఉంటే, లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
– ఈ అకౌంట్ లింక్ చేసేందుకు యాప్‌ను ఓపెన్ చేసి.. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
Android వెర్షన్ 2.22.24.27 వెర్షన్ WhatsApp బీటాలో టాబ్లెట్ వెర్షన్‌కి లింక్ చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ప్రతి WhatsApp యూజర్లకు అందుబాటులో ఉండదు. కొంతమంది యూజర్లకు మాత్రమే పరిమితం చేసినట్టు నివేదిక తెలిపింది. ఇటీవలే వాట్సాప్ యూజర్లకు మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ (Whatsapp Message Yourself)ను ప్రవేశపెట్టింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ నెల ప్రారంభంలో కొంతమంది యూజర్ల కోసం ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు అందరి యూజర్లకు అందుబాటులో ఉంది.

WhatsApp allowing some ‘lucky’ users to use account on two Android devices
ఈ ఫీచర్ వాట్సాప్‌లో నోట్స్, రిమైండర్‌లు, షాపింగ్ లిస్ట్‌లను తమకు తామే పంపుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. WhatsApp Message Yourself ఫీచర్‌ని ఉపయోగించేందుకు యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp యాప్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ డివైజ్‌లో Google Play Store/Apple యాప్ స్టోర్‌కి వెళ్లండి. ఆ యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, దిగువ సూచనలను ఫాలో అవ్వండి.
– మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
– కొత్త చాట్ బటన్‌పై Tap చేయండి.
– iPhoneలో రైట్ టాప్ కార్నర్‌లో Android ఫోన్‌లలో కిందిభాగంలో ఉంటుంది.
– మీరు మీ మొబైల్ నంబర్‌తో కాంటాక్ట్ కార్డ్‌ని ‘Message Yourself’ అని ఉంటుంది.
– కాంటాక్టుపై Click చేసి, మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..