Airtel Prepaid Plans Offer : ఎయిర్టెల్ యూజర్లకు అదిరే ఆఫర్లు.. ఆ రెండు ప్లాన్లపై ఫ్రీగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు!
Airtel Prepaid Plans Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) యూజర్లకు అదిరే ఆఫర్లు.. మీరు ఓటీటీ బెనిఫిట్స్ (OTT Benefits) పొందాలనుకుంటే ఎయిర్టెల్ అందించే ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లలో ఏదైనా ఒకటి యాక్టివేట్ చేసుకోండి.
Airtel Prepaid Plans Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ (Airtel) యూజర్లకు అదిరే ఆఫర్లు.. మీరు ఓటీటీ బెనిఫిట్స్ (OTT Benefits) పొందాలనుకుంటే ఎయిర్టెల్ అందించే ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లలో ఏదైనా ఒకటి యాక్టివేట్ చేసుకోండి. ఎయిర్టెల్ అందించే ప్లాన్ల ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. మీరు ఫ్రీగా సబ్స్క్రిప్షన్లను అందించే ప్రీపెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే రెండు సరికొత్త ప్లాన్లను Airtel మళ్లీ ప్రవేశపెట్టింది.
గతంలో మాదిరి ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్ అందించనుంది. టెలికాం టాక్ ప్రకారం.. ఎయిర్టెల్ అనేక ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌ను తొలగించింది. ఇప్పుడు ఎయిర్టెల్ రూ.3359, రూ.499 ప్లాన్లకు మాత్రమే లిమిట్ అందిస్తోంది. అయితే, ఎయిర్టెల్ ఇప్పుడు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు తిరిగి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. Airtel డిస్నీ+ హాట్‌స్టార్‌ని రూ. 399, రూ. 839 ప్లాన్లకు యాడ్ చేసింది. ఈ రెండు ప్లాన్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎయిర్టెల్ రూ. 399 ప్లాన్ :
మీకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ కావాలంటే.. రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్ అందించే లైనప్‌లో అత్యంత సరసమైన ప్లాన్ ఇది. ఈ ప్లాన్‌తో మీ మొబైల్లో మాత్రమే డిస్నీ+ హాట్‌స్టార్‌ను ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌తో మీరు అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. 3 నెలల పాటు OTT బెనిఫిట్స్ పొందవచ్చు.
దీని (రూ. 149). రూ. 399 ప్లాన్‌తో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 SMS/రోజుకు 28 రోజుల పాటు రోజువారీ డేటా 2.5GB రోజువారీ డేటా బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వింక్ మ్యూజిక్ (Wink Music), ఉచిత హెలోట్యూన్స్ (Free HelloTunes), ఫాస్ట్‌ట్యాగ్ (Fastag)పై రూ. 100 క్యాష్‌బ్యాక్, అపోలో 24|7 సర్కిల్ వంటి ఎయిర్టెల్ థాంక్స్ (Airtel Thanks) బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
ఎయిర్టెల్ రూ. 839 ప్లాన్ :
మీరు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ పొందాలంటే.. రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్‌తో మీరు కేవలం 3 నెలల పాటు మీ మొబైల్లో యాప్‌ను పొందవచ్చు. OTT బెనిఫిట్స్‌తో పాటు.. ఈ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 84 రోజుల పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి. అదనంగా, మీరు రివార్డ్స్ మినీ సబ్స్క్రిప్షన్, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కూడా పొందవచ్చు.
మీరు ఎయిర్టెల్ సబ్‌స్క్రైబర్ అయితే.. మీరు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అలాగే ఎయిర్టెల్ అందించే 4 ప్లాన్ల నుంచి ఇప్పుడు మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు. ఆయా ప్లాన్లలో రూ. 3359, రూ. 839, రూ. 499, రూ. 399 ఉన్నాయి. ప్రస్తుతం, వోడాఫోన్ (Vi), ఎయిర్టెల్ (Airtel) మాత్రమే ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ (Free Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. రిలయన్స్ జియోలో ప్రస్తుతం అలాంటి ఆఫర్ ఏదీ అందుబాటులో లేదు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..