Amazon Summer Sale 2024 : మరో 24 గంటల్లో అమెజాన్ సమ్మర్ సేల్ 2024.. ఈ టాప్ 7 బెస్ట్ 5జీ ఫోన్ డీల్స్ మీకోసం..!

Amazon Summer Sale 2024 : అమెజాన్ సమ్మర్ సేల్ 2024 మరో 24 గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో టాప్ 7 బెస్ట్ 5జీ ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

Amazon Summer Sale 2024 : మరో 24 గంటల్లో అమెజాన్ సమ్మర్ సేల్ 2024.. ఈ టాప్ 7 బెస్ట్ 5జీ ఫోన్ డీల్స్ మీకోసం..!

Amazon Summer Sale 2024 ( Image Source : Google)

Updated On : May 2, 2024 / 10:34 AM IST

Amazon Summer Sale 2024 : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఈ నెల (మే) 3న ప్రారంభం కానుంది. మే 2న ప్రైమ్ మెంబర్‌ల కోసం ఒక రోజు ముందుగానే సేల్ అందుబాటులోకి రానుంది. అమెజాన్ అనేక 5జీ ఫోన్లపై భారీ తగ్గింపులను అందించనుంది. ఈ ఏడాదిలో అతిపెద్ద సేల్ ఈవెంట్‌లలో ఒకటిగా పేర్కొంది. తక్కువ ధరకు ఇష్టమైన ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్ సందర్భంగా టాప్ 7 బెస్ట్ 5జీ ఫోన్ డీల్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

Read Also : Sundar Pichai : బిలియనీర్ కాబోతున్న సుందర్​ పిచాయ్​.. గూగుల్ సీఈఓ నికర సంపద 100 కోట్ల డాలర్లకు చేరువగా!

ఈ జాబితాలో రూ. 10వేల నుంచి రూ. 65వేల మధ్య ఖరీదు చేసే 5జీ ఫోన్‌లు ఉన్నాయి. తద్వారా 2024 అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో ఆసక్తిగల వినియోగదారులు తమకు ఇష్టమైన ఫోన్ డీల్‌ను పొందవచ్చు. లేటెస్ట్ అమెజాన్ ఫోన్ డీల్‌ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లు, కొన్ని ఫ్లాట్ డిస్కౌంట్లు, కూపన్‌లు అందుబాటులో ఉండనున్నాయి. అమెజాన్ సమ్మర్ సేల్ 2024 మరో 24 గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో 7 బెస్ట్ 5జీ ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 ధర రూ. 9,499 :
కెమెరా పనితీరు, భారీ డిస్‌ప్లే ధర రూ.10వేల లోపు సాధారణ పనితీరుతో కూడిన 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ M14 మోడల్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో రూ. 9,499 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి నోట్ 13 ధర రూ. 15,499 :
రెడ్‌మి నోట్ 13 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో సైట్ జాబితా ప్రకారం, మిడ్ రేంజ్ డివైజ్ ప్రభావవంతంగా రూ. 15,499కి విక్రయిస్తోంది. రూ. 15వేల బడ్జెట్‌తో కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

ఐక్యూ Z9 ధర రూ. 17,999 :
భారత్‌లో ఐక్యూ Z9 ఫోన్ రూ. 19,999 ప్రారంభ ధరతో ప్రకటించనుంది. అమెజాన్ ఈ 5జీ మిడ్ రేంజ్ ఫోన్‌ను రూ. 17,999 ధరకు అందిస్తోంది. దీని ప్రకారం.. యూజర్లకు రూ.2వేల తగ్గింపు పొందవచ్చు. రూ. 20వేల లోపు బెస్ట్ ఫోన్, పోకో ఎక్స్6, నథింగ్ ఫోన్ 2ఎ వంటి ప్రముఖ 5జీ ఫోన్‌లతో పోటీ పడుతోంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ధర రూ. 22,999:
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ధర రూ. 22,999 ఖర్చు అవుతుంది. ఇందులో బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్‌లు ఉంటాయి. రూ. 25వేల లోపు అత్యుత్తమ 5జీ ఫోన్‌లలో ఒకటి. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500ఎంఎహెచ్ బ్యాటరీ, 120హెచ్‌జెడ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 2,160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ కళ్లకు సురక్షితంగా ఉంటుంది. వన్‌ప్లస్ కొత్త ఆక్వా టచ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ తడిగా ఉన్నప్పుడు లేదా మీ వేళ్లు తడిగా ఉన్నప్పటికీ ఈజీగా ఆపరేట్ చేయొచ్చు.

వన్‌ప్లస్ 11ఆర్ ధర రూ. 29,999 :
వన్‌ప్లస్ 11ఆర్ ఫోన్ ధర రూ. 30వేల లోపు అందుబాటులో ఉంటుంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. రూ. 29,999 ధరకు అందుబాటులో ఉంటుందని సైట్ వెల్లడించింది. అసలు ధర రూ. 39,999 నుంచి తగ్గుతుంది. హై-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8+జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది.

ఐక్యూ నియో 9 ప్రో రూ. 31,999 :
ఐక్యూ నియో 9ప్రో పాత ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ని కలిగి ఉండవచ్చు. కానీ, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 అనేక 2023 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను అందించింది. అదనంగా, 144హెచ్‌జెడ్ ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే, 50ఎంపీ ప్రధాన కెమెరా, భారీ 5,160ఎంఎహెచ్ బ్యాటరీని పొందవచ్చు. టాప్-అప్ కోసం 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ అందిస్తుంది.

ఐఫోన్ 13 ధర రూ. 47,499 :
ఈ ఐఫోన్ రాబోయే అమెజాన్ సేల్ ద్వారా రూ. 47,499కి విక్రయించనుంది. ఐఫోన్ 13 ఇంకా ఆపిల్ అత్యంత ప్రజాదరణ పొందిన ఐఫోన్‌లలో ఒకటి. ఐఫోన్ 14 కూడా ఐఫోన్ 13 మాదిరిగానే స్పెషిఫికేషన్లతో వస్తుంది. ఇందులో పాత డివైజ్ మరింత ప్రాచుర్యం పొందింది. ఐఫోన్ అభిమానులు లేటెస్ట్ ఐఫోన్ 15ని కొనుగోలు చేయలేని పక్షంలో ఐఫోన్ 13ని కొనుగోలు చేయొచ్చు.

Read Also : WhatsApp Pin Chats : వాట్సాప్ యూజర్లు ఇకపై 3 మెసేజ్‌ల వరకు పిన్ చేయొచ్చు.. ఇదిగో ఇలా!