KTM 390 Adventure X : రూ. 2.8 లక్షలకే భారత్‌లోకి KTM 390 అడ్వెంచర్ X వచ్చేసింది..!

KTM 390 Adventure X : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? రూ. 2.8 లక్షలకే భారత మార్కెట్లోకి KTM 390 అడ్వెంచర్ X వచ్చేసింది. ఇతర KTM మోడల్ అనేది 390 అడ్వెంచర్‌తో పోలిస్తే.. మోడల్ స్టాండింగ్‌ని ఎంట్రీ లెవల్ ట్రిమ్ అని చెప్పవచ్చు.

KTM 390 Adventure X : రూ. 2.8 లక్షలకే భారత్‌లోకి KTM 390 అడ్వెంచర్ X వచ్చేసింది..!

KTM 390 Adventure X launched in India at Rs 2.8 lakh

KTM 390 Adventure X : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ (KTM Asia) కేటీఎం ఏసియా భారత మార్కెట్లో 390 అడ్వెంచర్ Xని లాంచ్ చేసింది. (KTM X) మోడల్ అనేది 390 అడ్వెంచర్‌తో పోల్చితే.. మోడల్ స్టాండింగ్‌ని ఎంట్రీ-లెవల్ ట్రిమ్‌గా చెప్పవచ్చు. ఈ మోడల్ X ధర రూ. 2.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. రూ. 3.38 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉన్న 390 అడ్వెంచర్‌తో పోలిస్తే.. చాలా ఎక్కువ పాకెట్ ఫ్రెండ్లీగా వస్తుంది.

ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్, కార్నరింగ్ ABS, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన TFT-డిస్‌ప్లే వంటి ఫీచర్‌లను డిలీట్ చేయడం ద్వారా ధరలో తగ్గింపు పొందవచ్చు. మిగిలిన మోటార్‌సైకిల్ అదే విధంగా ఉంది. ఇప్పటికీ LED లైటింగ్, అదే బాడీ మోటారును అందిస్తుంది. KTM 390 అడ్వెంచర్ X ఆరెంజ్, డార్క్ గాల్వానో అనే రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.

Read Also :  Apple BKC Store : ఆపిల్ స్టోర్ ఫస్ట్ కస్టమర్‌ కోరిక తీర్చిన టిమ్ కుక్.. 15 గంటల పాటు స్టోర్ బయటే పడిగాపులు..!

కొత్త లాంచ్‌పై బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రో-బైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఆన్/ఆఫ్రోడ్, అడ్వెంచర్ ఓరియెంటెడ్ మోటార్‌సైకిళ్ల విభాగం పెరుగుతోంది. FY23లో KTM 60శాతం వృద్ధిని సాధించింది. KTM ప్రో-XPలో KTM అడ్వెంచర్ కస్టమర్ భాగస్వామ్యాన్ని అందించింది’ అని అన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 50శాతం పైగా కొత్త కస్టమర్లతో అడ్వెంచర్ మోటార్‌సైక్లింగ్‌కు పెరుగుతున్న డిమాండ్‌ని సూచిస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే.. 390CC మోటార్ 43.5BHP, 37NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

KTM 390 Adventure X launched in India at Rs 2.8 lakh

KTM 390 Adventure X launched in India at Rs 2.8 lakh

మోటార్‌సైకిల్‌లో స్ప్లిట్ ట్రెల్లిస్ ఫ్రేమ్, ఆఫ్-రోడ్ మోడ్‌తో డ్యూయల్-ఛానల్ ABS, 320mm ఫ్రంట్, 230mm వెనుక డిస్క్ బ్రేక్‌లు, 43mm WP అపెక్స్ USD ఫోర్క్ రియర్ మోనోషాక్, 200mm గ్రౌండ్ క్లియరెన్స్, LCD డిస్‌ప్లే ఉన్నాయి. KTM 390 అడ్వెంచర్ X BMW G 310 GS రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లకు పోటీగా ఉంది. BMW ఖరీదైనది అయినప్పటికీ.. హిమాలయన్ తక్కువ ధరలో ఉంది. కానీ, తక్కువ పవర్ బ్రాకెట్‌లోకి వస్తుంది.

Read Also : Google Pixel 7a Price : గూగుల్ పిక్సెల్ 7a ధర ఎంతో తెలిసిందోచ్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. Pixel 6a కన్నా ఖరీదైనదేనా?