Amazon Prime Day 2024 Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. రూ. 30వేల లోపు ధరలో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. గెట్ రెడీ!
Amazon Prime Day 2024 Sale : ఈ స్మార్ట్ఫోన్ల తగ్గింపు ధరలపై బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
![Amazon Prime Day 2024 Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. రూ. 30వేల లోపు ధరలో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. గెట్ రెడీ! Amazon Prime Day 2024 Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. రూ. 30వేల లోపు ధరలో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. గెట్ రెడీ!](https://10tv.in/wp-content/uploads/2024/07/Top-Early-Deals-on-Smartphones-Under-Rs.-30k-Only.jpg)
Top Early Deals on Smartphones ( Image Source : Google )
Amazon Prime Day 2024 Sale : అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. జూలై 20 నుంచి జూలై 21 రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ వారాంతంలో అనేక రకాల ప్రొడక్టులు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి.
ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి పెద్ద అప్లియన్సెస్ నుంచి స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల వంటి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ ఫోన్లపై సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. సాధారణ మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరలకు వివిధ ఉత్పత్తులను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. రూ.30వేల లోపు స్మార్ట్ఫోన్లపై కొన్ని అడ్వాన్స్ డీల్స్ కూడా అందుబాటులో ఉంటాయని అమెజాన్ ప్రకటించింది.
బ్యాంకు లావాదేవీలపై ఆఫర్లు, డిస్కౌంట్లు :
ఈ స్మార్ట్ఫోన్ల తగ్గింపు ధరలపై బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు, అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. లావాదేవీల సమయంలో అమెజాన్ పే యూపీఐ, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ లేదా అమెజాన్ పే బ్యాలెన్స్‌ని ఉపయోగించే కస్టమర్లు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పొందవచ్చు. ఈ అదనపు ఆఫర్లన్నీ నిబంధనలు, షరతులకు లోబడి ఉంటాయి.
ఏ ఫోన్ ధర ఎంత ఉంటుందంటే? :
అమెజాన్ ప్రైమ్ డే 2024 సందర్భంగా స్మార్ట్ఫోన్లపై బెస్ట్ ప్రారంభ డీల్‌లలో వన్‌ప్లస్, రియల్‌మి, ఐక్యూ మరిన్ని ప్రముఖ బ్రాండ్ల హ్యాండ్సెట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశంలో ఆవిష్కరించిన ఐక్యూ నియో 9ప్రో 12జీబీ+ 256జీబీ ఆప్షన్ ధర రూ. 39,999కు అందుబాటులో ఉంది.
రాబోయే సేల్ సమయంలో రియల్‌మి జీటీ 6టీ తక్కువ ధర రూ. 29,999కు పొందవచ్చు. 8జీబీ+ 256జీబీ కాన్ఫిగరేషన్ ధర రూ. 35,999 ఉండగా, సేల్ సమయంలో ఈ మోడల్ రూ. 28,999 తగ్గింపు ధరకు అందిస్తోంది. కొత్త మిరాకిల్ పర్పుల్ కలర్‌వేలో కూడా అందుబాటులో ఉంది.
అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్ సందర్భంగా రూ. 30వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు :
- టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 5జీ ప్రారంభ ధర రూ. 54,999, తగ్గింపు ధర : రూ. 29,999
- ఐక్యూ నియో 9ప్రో 5జీ ప్రారంభ ధర రూ. 39,999, తగ్గింపు ధర : రూ. 29,999
- రియల్‌మి జీటీ 6టీ 5జీ ప్రారంభ ధర రూ. 35,999, తగ్గింపు ధర రూ. 28,999
- రెడ్మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ. 31,999, తగ్గింపు ధర : రూ. 27,499
- ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ. 27,999, తగ్గింపు ధర : రూ. 26,499
- వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ప్రారంభ ధర రూ. 24,999, తగ్గింపు ధర రూ. 21,999
Read Also : Poco M6 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? పోకో M6 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?