తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జిల్లాలివే..కేంద్రం ప్రకటన

  • Published By: madhu ,Published On : May 1, 2020 / 03:29 AM IST
తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జిల్లాలివే..కేంద్రం ప్రకటన

తెలంగాణలో కరోనా వైరస్ ఒకరోజు కేసులు ఎక్కువవుతుంటే..మరోరోజు తక్కువవుతున్నాయి. ఇంకా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందనే దానిపై ఓ క్లారిటీ రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. కొనసాగుతున్న లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తోంది.

ఆయా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందనే దానిపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. కేసులను బట్టి రెడ్, ఆరేంజ్, గ్రీన్ జోన్లను ప్రకటిస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. (ప్చ్..మళ్లీ పెరిగాయి : తెలంగాణలో కరోనా.. కొత్తగా 22 కేసులు)

గ్రీన్‌జోన్‌ జిల్లాలు : – యాదాద్రి, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, సిద్దిపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను గ్రీన్‌జోన్‌లుగా ప్రకటించారు.

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు : – కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, మెదక్‌, జనగామ, నారాయణపేట, ఆదిలాబాద్‌, నల్లగొండ, గద్వాల, నిర్మల్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలున్నాయి. 

రెడ్‌ జోన్‌ జిల్లాలు : – వరంగల్‌ అర్బన్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సూర్యపేట, రంగారెడ్డి జిల్లాలున్నాయి.