ఏదైనా రోగం వస్తే గబ్బిలాలు స్వచ్చందంగా సామాజిక దూరం పాటిస్తాయట!

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 07:29 AM IST
ఏదైనా రోగం వస్తే గబ్బిలాలు స్వచ్చందంగా సామాజిక దూరం పాటిస్తాయట!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయానికి సామాజిక దూరం పాటించాలని రోడ్లు, స్కూళ్లు, సినిమా థియేటర్లు అన్నీ మూసేశారు. ఇన్ఫెక్షన్ తో కూడిన వైరస్ వ్యాప్తి చెందుతుందని.. సోషల్ డిస్టెన్స్ పాటించడం బాధ్యత అని చెప్తున్నారు అధికారులు. కానీ, గబ్బిలాలకు ఇలా ఎవ్వరూ చెప్పనవసరం లేదు. ఓ రీసెర్చ్ లో వెల్లడైన వివరాల ప్రకారం.. జబ్బు చేసినప్పుడు గబ్బిలాలు తమంతట తామే సామాజిక దూరాన్ని పాటిస్తాయట. 

మనుషులు మాత్రమే కాదు. ఇన్పెక్షన్ తో కూడిన జబ్బులు వచ్చినప్పుడు గబ్బిలాలు కూడా సామాజికా దూరం పాటిస్తాయి. వాంపైర్ జాతికి చెందిన గబ్బిలాలు మాత్రమే ఇలా ప్రవర్తిస్తాయని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన సెబాస్టియన్ స్టాక్‌మైర్ అన్నారు. ఆహారం వెతుక్కునే క్రమంలో గబ్బిలాలు దాదాపు సింగిల్ గా కనిపించవు. కానీ, జబ్బు చేసినప్పుడు తప్పదు. (నాసా అంతరిక్షంలోకి పంపే హెలికాఫ్టర్‌కు పేరు పెట్టిన భారత సంతతి బాలిక)

అవి సామాజిక దూరాన్ని మాత్రమే పాటిస్తాయి. కానీ, సెల్ఫ్ ఐసోలేషన్ కాదని స్టాక్ మైర్ అంటున్నారు. ఓ వయస్సుకు వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగా లేనప్పుడు అవే స్వచ్ఛందంగా సామాజిక దూరాన్ని పాటిస్తాయి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రం వాటికి తల్లి గబ్బిలం సహకారం అందిస్తుంది. 

ఆ సమయంలో తల్లి గబ్బిలం ఇతర గబ్బిలాలతో సామాజిక దూరం పాటిస్తుంది. అయితే అవి సామాజిక దూరం పాటించేది అన్ని రకాల జబ్బులకు కాదు. కొన్ని మాత్రమే వైట్ నోస్ సిండ్రోమ్, ఫంగల్ డిసీజ్ లాంటి వాటికే. ఈ విషయాన్ని బ్రౌన్ రంగు గబ్బిలాలపై పరిశోధన జరిపి తెలుసుకున్నారు. జబ్బు చేసిన గబ్బిలం లక్షణాలు బటయకు కనిపిస్తాయి. వాటికి వెంట్రుకలు తక్కువగా ఎదుగుతుంటాయని రీసెర్చర్స్ అంటున్నారు.