H-1B వీసాదారులు,గ్రీన్ కార్డు దరఖాస్తుదాలకు ట్రంప్ గుడ్ న్యూస్

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 07:57 AM IST
H-1B వీసాదారులు,గ్రీన్ కార్డు దరఖాస్తుదాలకు ట్రంప్ గుడ్ న్యూస్

H-1B వీసాదారులు,గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ కు కొంత ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. ఇటీవల విదేశీ వలసదారులకు 60 రోజులపాటు గేట్లు మూసేసిన ట్రంప్ సర్కార్.. ఇప్పుడు ఎన్నారైలకు కాస్త మేలు చేసే నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా… నోటీసులు అందజేసిన హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు అవసరమైన పత్రాలను సమర్పించడానికి 60 రోజుల సమయం ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వం. ఈ మేరకు యుఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు.. తిరస్కరించే నోటీసులు.. ఉపసంహరించుకునే నోటీసులు.. ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగించే నోటీసులు.. ఫారం I-290బీ, నోటీస్ ఆఫ్ అప్పీల్ లేదా మోషన్ తదితర అంశాలకు సంబంధించి 60 రోజుల్లోగా సమర్పించాలని సూచించింది.

 H1B వీసా ద్వారా అమెరికాలో కంపెనీలు విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వగలవు. ఏటా వేల మంది భారత్, చైనా నుంచి వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక గ్రీన్ కార్డ్ అనేది అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది. ట్రంప్ విదేశీ వలసదారులకు బ్రేక్ వెయ్యడంతో… H1B వీసాకు అప్లై చేసుకున్నవారు, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నవారు చిక్కుల్లో పడ్డారు.(పట్టించుకోలేదు కానీ ట్రంప్ ప్రచారానికి వాడుకున్నారు)

ప్రస్తుతం అమెరికాలో… గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది అప్లై చేసుకోగా, వారిలో H-1B వీసా కలిగివున్నవారు 2 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి 60 రోజుల టైమ్ ఇచ్చారు కాబట్టి… విదేశీ వలసదారులపై నిషేధం గడువు (60 రోజులు) పూర్తవగానే… వీళ్లంతా తమ తమ పత్రాల్ని ఆమోదింపజేసుకునేందుకు వీలుకానుంది.

 కాగా, అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఇప్పటివరకు అమెరికాలో 11 లక్షల31వేల 492 కరోనా కేసులు నమోదవగా,65వేల 776మంది మరణించారు. 1లక్షా 61వేల 563మంది కోలుకున్నారు. కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన రోగులకు అత్యవసర మెడిసన్‌గా రెమ్‌డెసివిర్‌ యాంటీ వైర‌ల్ ఇంజక్షన్‌ను ఉపయోగించేందుకు అమెరికా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎబోలా ట్రీట్మెంట్ కోసం గతంలో తీసుకొచ్చిన రెమ్ డిసివర్ ను తీవ్ర‌మైన కోవిడ్19 పేషెంట్లకు ఇచ్చేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA)ఆమోదం తెలిపింది.