పట్టించుకోలేదు కానీ ట్రంప్ ప్రచారానికి వాడుకున్నారు : కరోనా వ్యాక్సిన్స్ ట్రయిల్స్ లో పాల్గొన్న మొదటి వ్యక్తి జెన్నీఫర్ హెల్లర్

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 07:58 AM IST
పట్టించుకోలేదు కానీ ట్రంప్ ప్రచారానికి వాడుకున్నారు : కరోనా వ్యాక్సిన్స్ ట్రయిల్స్ లో పాల్గొన్న మొదటి వ్యక్తి జెన్నీఫర్ హెల్లర్

యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడుతున్న విషయం తెలిసిందే. టెల్‌ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోఈ ట్రయిల్ లో…వ్యాక్సిన్ కోసం కోసం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఢిఫరెంట్ షాట్స్ యెక్క డోసెస్ తో 45 మంది యువ,ఆరోగ్యకరమైన వాలంటీర్లతో టెస్టింగ్ ప్రారంభమయింది.

అయితే మానువులపై ట్రయిల్స్ లో భాగంగా గత నెలలో జెన్నీఫర్ హెల్లర్ అనే 44ఏళ్ల మహిళకు(ఆమెకు కరోనా వైరస్ లేదు) ప్రపంచంలోనే మొదటగా ఈ పొటెన్షియల్ వ్యాక్సిన్ ఇవ్వబడిన విషయం అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్ సేఫ్టీని పరీక్షించడానికి 28 రోజుల వ్యవధిలో రెండు ఇంజెక్షన్లు ఇచ్చిన 45 మంది వాలంటీర్ల జెన్నీఫర్ హెల్లర్ ఒకరు. సామూహిక ఉత్పత్తి మరియు పంపిణీకి ఏదైనా వ్యాక్సిన్ గ్రీన్ లైట్ ఇవ్వడానికి ముందు అవసరమైన పెద్ద సంఖ్యలో ప్రక్రియలలో ఇది ఒకటి. MRNA-1273 అనే వ్యాక్సిన్ జంతువులపై పరీక్షించబడింది మరియు మంచి రిజల్ట్ చూపించింది. ఇది మానవునిపై ఉపయోగించడం ఇదే మొదటిసారి. 

అయితే ట్రయిల్స్ ముందే 45మందికి ఇచ్చిన  disclaimers(తమకు సంబంధం లేదని చెప్పేది)వాళ్లల్లో లేనిపోని భయాలను పుట్టించాయి. ట్రియిల్స్ లో పాల్గొనేవారికి ఆ తరువాత వైరస్ సోకే అవకాశం తక్కువేమీ లేదు. ఏది ఏమైనా జెన్నీఫర్ హాలర్ ఎలాగోలా సంతకం చేసేసింది. మార్చి-16 ఉదయం 8 గంటలకు ఇంజెక్షన్ కోసం వచ్చినప్పుడు మాత్రమే వ్యాక్సిన్‌ను పరీక్షించిన మొదటి వ్యక్తి తానే అని ఆమె గుర్తించింది. అయితే మొదటి రోజు తనకు టెంపరేచర్(ఉష్ణోగ్రత)పెరిగినట్లు ఆమె తెలిపింది. రెండవ రోజు చేయి చాలా గాయపడినట్లుగా ఉందని, కానీ ఆ తర్వాత అంతా బాగానే ఉందని, ఇది సాధారణ ఫ్లూ షాట్ వలె ఈజీ అని జెన్నీఫర్ తెలిపారు.

 

అయితే జెన్నీఫర్ ప్రయత్నాలు అమెరికా అధ్యక్షుడు లేదా కనీసం ఆయనకు సన్నిహితులు కూడా గుర్తించలేదు. డొనాల్డ్ ట్రంప్ నుండి ఎటువంటి సందేశం రాలేదని జెన్నీఫర్ చెప్పింది. అయితే ఆమె ఇంజెక్షన్ తీసుకున్న ఫుటేజ్ మాత్రం సంక్షోభ సమయంలో ట్రంప్ నాయకత్వాన్ని తెలిపే 30 సెకన్ల ప్రచార ప్రకటనలో ఉంది. ఈ విషయంలో దౌత్యపరంగా వెనక్కి తగ్గినట్లు జెన్నీఫర్ అంగీకరించింది.  గత వారమే జెన్నీఫర్ కు సెకండ్ డోస్ ఇచ్చారు. 2021జూన్ వరకు జెన్సీఫర్ తో సహా 45మందిపై మానిటరింగ్ జరుగుతూనే ఉంటుంది. తన ట్రయిల్ నుండి లేదా ఇతర దేశాలలో జరుగుతున్న ట్రయల్స్ నుండి విజయవంతమైన టీకా ఉద్భవిస్తుందని జెన్నీఫర్ నమ్మకంగా ఉంది. ఈ ప్రక్రియలో భాగమైనందుకు నేను గర్వపడతున్నాను అని ఆమె చెప్పారు.ఇదొక్కటే తాను చేయగలిగినదని, దీన్ని చేయడం సంతోషంగా ఉందని, తాను ప్రపంచాన్ని రక్షించట్లేదని జెన్నీఫర్ తెలిపింది.

 

కాగా,కొన్ని వారాల ముందు, ట్రయల్‌లో పాల్గొనేవారికి కోసం ఓ టెక్ స్టార్టప్‌లోని ఆపరేషన్స్ మేనేజర్ పిలుపునిచ్చినట్లు ఆమె ఫేస్ బుక్ లో చూసింది. ఆమె దాంట్లో భాగం కావాలని చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో కూడా తాము చాలా నిస్సహాయులుగా ఉన్నట్లు అనిపించిందని జెన్నీఫర్ తెలిపారు. వాషింగ్టన్ స్టేట్ లోని తన సొంత సెల్ఫ్ ఐసొలేషన్ గురించి ఆమెు వివరించారు. ఆమె మాట్లాడుతూ…కరోనా మహమ్మారిని ఆపడానికి నేను ఏమీ చేయలేను. అప్పుడు నేను ఈ అవకాశం రావడాన్ని చూశాను. ‘సరే, నేను సహకరించడానికి ఏదైనా చేయగలను అని అనుకున్నాను. అయితే జెన్నీఫర్ అవును అని చెప్పడం తక్షణమే జరగలేదు. ట్రయిల్స్ కు ఆమోదం పొందటానికి అవసరమైన మెడికల్ చెక్ లకు ఆమె వెళుతుండగా, అది సురక్షితంగా ఉంటుందా లేదా అని ఆమె భర్త కొంత కంగారుపడ్డాడు. చివరకు ఈ దంపతులు తమ కొడుకును శిశువుగా కొన్ని వైద్య అధ్యయనాలలో(మెడికల్ స్టడీస్) పాల్గొనడానికి అనుమతించారు, కానీ ఇది భిన్నంగా ఉంది.