లాక్ డౌన్‌లోనూ ఆగని అత్యాచారాలు, యువతిపై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 08:32 AM IST
లాక్ డౌన్‌లోనూ ఆగని అత్యాచారాలు, యువతిపై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు

లాక్ డౌన్ అమల్లో ఉంది. ఎక్కడ చూసినా పోలీసుల పహారా ఉంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరోనా వైరస్ భయాలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు కామంతో కాటేస్తున్నారు. గ్యాంగ్ రేప్ లకు పాల్పడుతున్నారు. మృగాల కన్నా హీనంగా ప్రవర్తించి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సోదరుడితో కలిసి బయటకు వెళ్లిన ఓ యువతిపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ లోని పాధార్ లో ఈ దారుణం జరిగింది.

సోదరుడిపై దాడి చేసి యువతి గ్యాంగ్ రేప్:
పాధార్ సమీప గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, బుధవారం(ఏప్రిల్ 29,2020) సాయంత్రం తన సోదరుడితో కలిసి బైక్ పై పెట్రోల్ బంక్ కు వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి తిరిగొస్తుండగా బైక్ హెడ్ లైట్ పనిచేయలేదు. బండిని ఆపి ఆమె సోదరుడు లైట్ ను సరిచేస్తుండగా.. ఇంతలో రెండు బైక్ లపై వచ్చిన ముగ్గురు దాడికి పాల్పడ్డారు. తొలుత ఆమె సోదరుడిని కొట్టి పక్కనే ఉన్న బావిలోకి నెట్టారు. ఆ తర్వాత యువతిని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో నలుగురు కలిసి మొత్తం ఏడుగురు యువతిని గ్యాంగ్ రేప్ చేశారు.

నిందితుల్లో ముగ్గురు మైనర్లు:
కాసేపటికి బావిలోంచి బయటపడ్డ యువతి సోదరుడు కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లు వచ్చి యువతి కోసం గాలింపు చేపట్టారు. సమీపంలోనే అపస్మారకస్థితిలో యువతి కనిపించింది. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఏడుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధితురాలు వీరిని గుర్తించిందని, మరో ఇద్దర్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

లాక్ డౌన్ లోనూ ఆగని అత్యాచారాలు:
కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుంచి మధ్యప్రదేశ్ లో క్రైమ్ రేట్ తగ్గింది. దీంతో పోలీసులు, ప్రజలకు కాస్త రిలీఫ్ పొందారు. దారి దోపిడీలు, దొంగతనాలు తగ్గాయి. అయితే లాక్ డౌన్ లోనూ అత్యాచారాలు ఆగడం లేదు. రాష్ట్రంలో ఏదో ఒక మూల నిత్యం రేప్ లు జరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.