గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో జనసేనకు చుక్కెదురు

జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై నిన్నే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు వెల్లడించింది ఎన్నికల కమిషన్.

గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో జనసేనకు చుక్కెదురు

Janasena Glass Symbol : ఏపీ హైకోర్టులో జనసేనకు చుక్కెదురైంది. గ్లాసు గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో సింబల్ మార్చలేమని తేల్చి చెప్పింది. జనసేన పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని తెలిపింది.

ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఆర్మ్డ్ ఫోర్స్ కు పంపించామని కోర్టుకు తెలిపింది ఈసీ. ప్రీ పోల్ అలయన్స్ ను గుర్తించాలని చట్టబద్ధత లేదని కోర్టుకు తెలిపిన ఈసీ.. జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై నిన్నే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు వెల్లడించింది.

వర్ల రామయ్య ఆధ్వర్యంలో కూటమి సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును ఎవరికీ కేటాయించొద్దని కూటమి ఆధ్వర్యంలో వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈసీ ఘాటుగానే స్పందించిందని చెప్పాలి. జనసేన పిటిషన్ కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో గాజు గ్లాసు గుర్తును అభ్యర్థులకు కేటాయించడం జరిగిందని, ఈ సమయంలో దాన్ని మార్చాలంటే అది కుదరని పని అని ఈసీ పేర్కొంది. బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధమైపోయాయని, ఇలాంటి సమయంలో గుర్తును మార్చడం కష్టం అని చెప్పి హైకోర్టుకు ఈసీ తెలిపింది.

ఈ ఎన్నికల్లో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వాళ్లకు సంబంధించి కొందరికి గ్లాసు గుర్తును కేటాయించారు. దీని వల్ల ఇబ్బందులకు గురవుతాయని కూటమి సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు పరిధిలో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని ఈసీ హైకోర్టుకు ఇప్పటికే తెలిపింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించొద్దని కూటమి సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ చెల్లదని, విచారణకు అర్హత లేదని హైకోర్టుకు ఈసీ తెలిపింది. ఈ పరిణామం కూటమికి షాక్ లాంటిది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : చంద్రబాబు.. దమ్ముంటే.. బీజేపీని అడుగు- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల