80ఏళ్లు దాటితే విమానాల్లోకి నో ఎంట్రీ, ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే..

  • Published By: Subhan ,Published On : May 12, 2020 / 12:22 PM IST
80ఏళ్లు దాటితే విమానాల్లోకి నో ఎంట్రీ, ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే..

క్యాబిన్ లగేజి నిషేదించడంతో పాటు 80ఏళ్లు దాటిన ప్యాసింజర్లకు కూడా అనుమతి లేదని తేల్చేశారు. COVID-19 కారణంగా మార్చి 25నుంచి ఎయిర్ ప్యాసింజర్ సర్వీసులు సస్పెండ్ చేశారు. కొత్త గైడ్ లైన్స్ ను బట్టి ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్ అనుగుణంగా కమర్షియల్ ఫ్లైట్లను పున:ప్రారంభించాలని ప్లాన్ చేసింది గవర్నమెంట్. 

సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, ఎయిర్ లైన్స్ అండ్ ఎయిర్ పోర్ట్ ఆపరేటర్స్ సోమవారం మీటింగ్ లో పాల్గొన్నారు. సోషల్ డిస్టన్స్ పాటిస్తూ మిడిల్ సీట్లు ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. టెర్మినల్ గేట్ల వద్ద ప్యాసింజర్ ఐడీలు చెక్ చేయడాన్ని కూడా తీసేయాలని అనుకుంటున్నారు. తద్వారా టెర్మినల్ గేట్ల వద్ద గుంపులు తగ్గుతాయని భావిస్తున్నారు. 

ఏవియేషన్ బిజినెస్ లో వాటాదారులు, ఎయిర్ లైన్స్ అండ్ ఎయిర్ పోర్టు ఆపరేటర్లు రూల్స్ ను ప్యాసింజర్లందరికీ కంపల్సరీ చేయనున్నారు. ఇంటి దగ్గరే వెబ్ చెక్ లో పాల్గొని అది పూర్తయ్యాకే ఎయిర్ పోర్టుకు రావాలని సూచించారు. ఎయిర్ పోర్టులో రిపోర్టింగ్ టైం మరో 2గంటల పాటు పెంచారు. మరో 6గంటల్లో విమానం బయల్దేరుతుందనగా అప్పుడే ప్రయాణికులను లోనికి అనుమతిస్తారు. 

క్యాబిన్ లగేజిని అనుమతించరు. 20కేజీల కంటే తక్కువ ఉన్న చెక్ ఇన్ బ్యాగేజికి మాత్రమే పర్మిషన్ ఉంది. 80ఏళ్లు దాటిన వాళ్లకు నో ఎంట్రీ అని చెప్పేశారు. ప్రయాణికుల్లో ఎవరికైనా బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే వారికి ట్రావెలింగ్ డేట్ మార్చుకునే సదుపాయం ఉంటుంది. 

ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం తప్పనిసరి. అందులో ఎవరి స్టేటస్ అయితే గ్రీన్ స్టేటస్ ఉంటుందో.. వారికి మాత్రమే అనుమతి. చెక్ ఇన్ కౌంటర్లను మూడు గంటల ముందే తెరవాలని ఎయిర్ లైన్స్ అడిగింది. బయల్దేరడానికి 60 నుంచి 75 నిమిషాల ముందు వారికి అనుమతులివ్వాలి. బోర్డింగ్ గేట్ వద్ద సెకండరీ టెంపరేచర్ చెక్ నిర్వహిస్తుంది ఎయిర్ లైన్స్. 

బోర్డింగ్ లో ఉన్నప్పుడు ప్యాసింజర్లకు మీల్స్ సర్వ్ చేయరు. వాటర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. విమానంలోని చివరి 3 అడ్డం వరుసలు ప్యాసింజర్లలో ఎవరికైనా బాగుండకపోతే ఐసోలేషన్ ఉంచడం కోసం విడిచిపెడతారు. వారిని సిబ్బంది పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్‌తో చూసుకుంటారు. 

Read Here>> ఇండియాలో విమాన సర్వీసులు ప్రారంభం ఎప్పుడంటే..గ్రీన్ జోన్ల నుంచి గ్రీన్ జోన్ల వరకే