ఇండియాలో విమాన సర్వీసులు ప్రారంభం ఎప్పుడంటే..గ్రీన్ జోన్ల నుంచి గ్రీన్ జోన్ల వరకే

  • Published By: madhu ,Published On : May 12, 2020 / 04:27 AM IST
ఇండియాలో విమాన సర్వీసులు ప్రారంభం ఎప్పుడంటే..గ్రీన్ జోన్ల నుంచి గ్రీన్ జోన్ల వరకే

భారత దేశంలో విమాన సేవలు ప్రారంభం కాబోతున్నాయా..కేంద్రం సంకేతాలు చూస్తే అలానే ఉంది..మే 17 తర్వాత డొమెస్టిక్ సర్వీసులను పరిమిత స్థాయిలోనైనా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్రం.. అదికూడా  ముందు గ్రీన్ జోన్లలోనే. పూర్తి రక్షణ విధానాలు పాటిస్తూ..ఫ్లైట్  సర్వీసులు ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే డిజిసిఎ, విమానయానశాఖ, సిఐఎస్ఎఫ్‌కి చెందిన ఉన్నతాధికారులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇందుకు సంబంధించిన సన్నద్దతని పరిశీలించినట్లు సమాచారం..

మార్చి నెలలో కరోనా మహమ్మారి కారణంగా విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేయడంతో..ఏవియేషన్ సెక్టార్ ఎక్కడిక్కడ  స్తంబించిపోయింది..లాక్‌డౌన్ గడువు మే 17 వరకూ పొడిగించిన కేంద్రం..ఒక్కో రంగంలో మెల్లమెల్లగా సడలింపులు ప్రకటిస్తూ వస్తోంది. అందులో భాగంగానే రైళ్లను కూడా పరిమిత సంఖ్యలో నడవడానికి అనుమతి ఇచ్చింది.

ఈ నేపధ్యంలోనే విమానయానశాఖ కూడా మే 18 నుంచి కొన్ని సర్వీసులు గ్రీన్ జోన్ల నుంచి గ్రీన్ జోన్లకి నడిపే ఆలోచన చేసిందంటున్నారు..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అర్వింద్ సింగ్ కూడా రెండు రోజుల క్రితమే ఈ దిశగా సంకేతాలు కూడా ఇచ్చారు. ఎయిర్‌పోర్ట్ నిర్వాహకులు..విమానయాన సంస్థలతో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చర్చలు జరిపిందని తెలిపారు. మొత్తంగా కాకుండా 25శాతం సర్వీసులు నడిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

విమాన సర్వీసులు కనుక ప్రారంభమైతే..పాసింజర్లు తగు జాగ్రత్తలు, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది..ముందుగా ఎయిర్ పోర్ట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు..ప్రయాణీకులు మాస్క్‌లు ధరించాలి..అలానే ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉండాలి..ప్రయాణించేవారికి కరోనా లక్షణాలు కన్పిస్తే విమానం ఎక్కనివ్వరు.

విమాన ప్రయాణానికి సంబంధిన మార్గదర్శకాలపై కేంద్రం అధికారిక ప్రకటన జారీ అయిన మరుక్షణం ఫ్లైట్ కంపెనీలు కూడా తమ సర్వీసుల పునరుద్ధరణకి తయారుగా ఉన్నారు..  ప్రస్తుతానికి లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వస్ధలాలకు చేర్చేందుకు ప్రభుత్వం పరిమితంగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించింది. 64 ప్రత్యేక విమానాల్లో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నారు.

ఇదే క్రమంలో దేశీయ సర్వీసులను కూడా మెల్లగా ప్రారంభించే అవకాశం కన్పిస్తోంది..సర్వీసులు ప్రారంభమైతే..అటు చాలామంది పాసింజర్లు కూడా ఊరట పొందనున్నారు..మార్చి నుంచి టిక్కెట్లు బుక్ చేసుకున్నవారి సొమ్మంతా..ఎయిర్ లైన్స్ సంస్థల దగ్గరో..ఏజెంట్ల దగ్గరో చిక్కుకుపోయి ఉంది..వీటిలో ఎక్కువ కంపెనీలు పాసింజర్లకి డబ్బులు రిటన్ చేయకుండా.. క్రెడిట్ షెల్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రయాణం బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు..

ఇప్పుడు ప్రయాణాలు ప్రారంభమైతే..టిక్కెట్ల ధనం వెనక్కి ఇవ్వడమో..లేదంటే పాసింజర్లే జర్నీలు చేయడమో జరుగుతుంది..ఇక డొమెస్టిక్ సర్వీసుల ప్రారంభంపై తుది నిర్ణయం కేంద్రం నుంచి ఏ క్షణాన్నైనా వెలువడే అవకాశముంది. మరోవైపు సివిల్‌ ఏవియేషన్‌ మినిస్టర్‌ హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ఓ ఫోటోను పోస్ట్‌ చేసి సరదాగా కామెంట్‌ చేశారు. వందేభారత్‌ కార్యక్రమంలో భాగంగా సింగపూర్‌ నుంచి ముంబై వస్తున్న ప్రయాణికులు ధరించిన ఫేస్‌ షీల్డ్స్‌ను ఉద్దేశించి.. ఇది హాలీవుడ్‌ సినిమా సీన్‌ కాదంటూ ట్వీట్‌ చేశారు. అందరినీ సురక్షితంగా తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమన్నారు.

Read More:

త్వరలో విమాన సర్వీసులు…ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో UV డిసిన్ఫెక్షన్ టెక్నాలజీ

రైల్వేలో 20నిమిషాల్లో అయిపోయిన బుకింగ్‌లు