ఏపీ వాసులకు గుడ్ న్యూస్..కరోనా తగ్గుముఖం

  • Published By: madhu ,Published On : May 13, 2020 / 02:29 AM IST
ఏపీ వాసులకు గుడ్ న్యూస్..కరోనా తగ్గుముఖం

ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. టెస్ట్‌లు పెరుగుతున్నా రోజురోజుకూ కొత్త కేసులు తగ్గిపోతున్నాయి. ఇది.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వారం క్రితం ప్రతిరోజూ 70-80 కేసులు నమోదవగా..  గత నాలుగైదు రోజులుగా 30-40కి మించి పెరగలేదు.

2020, మే 12వ తేదీ మంగళవారం 33 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2 వేల 51కు చేరుకుంది. ఇప్పటివరకు 1056 మంది డిశ్చార్జ్ కాగా.. 46 మంది మరణించారు. మంగళవారం 58 కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 949మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీలో మంగళవారం 10 వేల 730 మందికి పరీక్షలు చేయగా 33మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు-10, తూర్పుగోదావరి-1, కృష్ణా-4, కర్నూలు-9, నెల్లూరు-9 ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో సింగిల్ కేసు కూడా నమోదు కాలేదు. కాగా… ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌ ప్లేస్‌లో ఉంది. కర్నూలులో మొత్తం 584 కేసులు నమోదవగా.. గుంటూరులో 387, కృష్ణాలో 346 నమోదయ్యాయి.

Read More:

* ఏపీలో Lock Down : 6 కమిటీలు..6 బ్రూ ప్రింట్ లు

* ఏపీలో కరోనా @ 2051 : కొత్త కేసులు 33. 20 కోయంబేడ్ నుంచి వచ్చినవే