ఏపీ, తమిళనాడును వణికిస్తున్న ‘కోయంబేడు’

  • Published By: srihari ,Published On : May 14, 2020 / 01:50 AM IST
ఏపీ, తమిళనాడును వణికిస్తున్న ‘కోయంబేడు’

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోయంబేడు మార్కెట్ వణుకు పుట్టిస్తోంది. దక్షిణాసియాలోనే అతి పెద్ద మార్కెట్ అయిన కోయంబేడు కరోనా వైరస్ కు కేంద్రంగా మారింది. చెన్నై శివారులో విస్తరించి ఉన్న ఈ అతిపెద్ద మార్కెట్ నుంచే కరోనా విస్తరిస్తోంది. ఏప్రిల్30న మార్కెట్లో రిటైల్ లావాదేవీలను నిలిపివేశారు. మే5న హోల్ సేల్ వ్యాపారాన్ని నిలిపివేశారు. 11 నుంచి పాక్షికంగా టోకు వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ మార్కెట్ కేంద్రంగానే తమిళనాట సుమారు 2,000కు పైగా కేసులు.. రాష్ట్రంలో 60కుపైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలో 50 కేసుల వరకూ నమోదు అయ్యాయి. వివిధ జిల్లాల నుంచి సుమారు 2వేల మంది కోయంబేడుకు రాకపోకలు సాగించినట్టు అంచనా వేస్తున్నారు.  

కోయంబేడు మార్కెట్లో పండ్ల హోల్ సేల్, పువ్వులు, కూరగాయలు, రిటైల్ వ్యాపారం జరుగుతోంది. 2వేలు పెద్ద, 1,000 చిన్న షాపులు ఉన్నాయి. 24 గంటలపాటు ఇక్కడ రద్దీ కనిపిస్తుంది. నిత్యం దాదాపు లక్ష మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. తమిళనాడులోని జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలోనే వెళ్తుంటారు. 

రాష్ట్రం నుంచి ఆ మార్కెట్‌కు రాకపోకలు సాగించినవారిలో 1,500 మంది వివరాలు తెలుసుకున్నట్టు తెలిసింది. కోయంబేడు మార్కెట్లో వ్యాపార లావాదేవీలు సాగించిన పలు జిల్లాలకు చెందిన దాదాపు వెయ్యి మందిని వివిధ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారని తెలుస్తోంది. రైతులు, వ్యాపారులు మాత్రమే కాకుండా…లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. అందరికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 

Read Here>> ఏపీలో కరోనా @ 2051 : కొత్త కేసులు 33. 20 కోయంబేడ్ నుంచి వచ్చినవే