మాట్లాడటం ద్వారా కూడా కరోనావైరస్ వేగంగా సోకుతుంది : సైంటిస్టుల హెచ్చరిక

  • Published By: srihari ,Published On : May 15, 2020 / 02:39 AM IST
మాట్లాడటం ద్వారా కూడా కరోనావైరస్ వేగంగా సోకుతుంది : సైంటిస్టుల హెచ్చరిక

కరోనా వైరస్ అనేక మార్గాల్లో వ్యాపిస్తోంది. కరోనా వైరస్ ఏయే మార్గాల్లో వ్యాపిస్తుంది అనేదానిపై ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దగ్గు, తుమ్మడం ద్వారా కరోనా వైరస్ నీటి బిందువుల ద్వారా వ్యాప్తిచెందుతుందని తెలుసు. శ్వాసతో పాటు ఇప్పుడు మాట్లాడటం ద్వారా కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందగల సామర్థ్యం ఉందని అంటోంది పరిశోధకుల అధ్యయనం. మాట్లాడే సమయంలో ఏర్పడే సూక్ష్మ నీటిబిందువుల ద్వారా గాల్లోకి కరోనా వైరస్ వ్యాప్తి చెంది దాదాపు 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంటాయని స్టడీ వెల్లడించింది. దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి మాట్లాడటం ద్వారా కూడా కొవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతుందని National Institute of Diabetes and Digestive and Kidney Diseases (NIDDK) పరిశోధకులు చెబుతున్నారు. 

ఒక మూసివేసిన బాక్సులో ఒక వ్యక్తిని ఉంచి 25 సెకన్ల పాటు ‘స్టే హెల్తీ’ అనేపదాన్ని గట్టిగా పదేపదే చెప్పమన్నారు. అదే పెట్టెలో ఒక లేజర్ కూడా ఉంచారు. ఆ సమయంలో అతడి నోటి నుంచి విడుదలైన నీటి తుంపర్లను లేజర్ ద్వారా గుర్తించారు. ఎంత పరిమాణంలో తుంపర్లు బయటకు వచ్చాయో లెక్కించారు. తుంపర్లు సగటున 12 నిమిషాలు గాలిలో ఉండిపోయినట్టు గుర్తించారు. 

దీనికి సంబంధించి అధ్యయనాన్ని  journal Proceedings of the National Academy of Sciences (PNAS)లో ప్రచురించింది. లాలాజలంలో ఉండే కరోనావైరస్ పరిగణనలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు.. ప్రతి నిమిషం బిగ్గరగా మాట్లాడటం వలన దగ్గరగా ఉన్న ప్రదేశంలో ఎనిమిది నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం గాలిలో ఉండిపోయే సామర్థ్యం  ఉందని గుర్తించారు. మాట్లాడినప్పుడు 1,000 కంటే ఎక్కువ వైరస్ కలిగిన నీటి తుంపర్లను ఉత్పత్తి చేయవచ్చని సైంటిస్టులు అంచనా వేశారు.

పదుల నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు గాల్లోనే ఉండిపోయాయి. పరిమిత ప్రదేశాలలో వైరస్ వ్యాప్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అని పరిశోధకులు తేల్చారు. అదే బృందం తక్కువ బిగ్గరగా మాట్లాడటం తక్కువ నీటి తుంపర్లను ఉత్పత్తి చేస్తుందని,  New England Journal of Medicineలో ఏప్రిల్‌లో ప్రచురించింది. మాట్లాడటం ద్వారా COVID-19 అంటువ్యాధి స్థాయిని నిర్ధారించగలిగితే.. చాలా దేశాలలో ఫేస్ మాస్క్ ధరించడమనేది తప్పనిసరిగా సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు… వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో కూడా అధ్యయనం వివరణ ఇచ్చింది. 

Read Here>> కరోనావైరస్ కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.. కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యమంటున్న సైంటిస్టులు