Apple iPhone 11 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11పై భారీ తగ్గింపు.. కేవలం రూ. 8,950 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!
Apple iPhone 11 Sale : ఆపిల్ ఐఫోన్ 11 మోడల్ ఇప్పటికీ అనేక ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ నిలిచిపోయినప్పటికీ ఆపిల్ నుంచి పూర్తి సపోర్టును కొనసాగిస్తోంది.
Apple iPhone 11 Sale in Flipkart : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 11 (iPhone 11) ధర భారీగా తగ్గింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే.. ఇప్పటివరకు అత్యంత ప్రజాదరణ పొందిన ఐఫోన్ మోడల్‌లలో ఇదొకటి. అలాంటి ఆపిల్ iPhone 14 సిరీస్‌ను లాంచ్ తర్వాత ( iPhone 11 Series ) కంపెనీ నిలిపివేసింది. కానీ, ఇప్పటికీ బెస్ట్ కెమెరాలతో అద్భుతమైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఐఫోన్ 11 సిరీస్‌లో ఐఫోన్ 11 బేస్ మోడల్.. ఇందులో ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్ కూడా ఉన్నాయి. భారత మార్కెట్లో 2019లో రూ. 64,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా ఐఫోన్ 11 రూ. 32,049 తగ్గింపు తర్వాత కేవలం రూ. 8,950కి లభిస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 11 మోడల్ 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్ప్లేను కలిగి ఉంది. A13 బయోనిక్ చిప్సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ 12MP సెన్సార్లు, ముందు భాగంలో 12MP సెల్ఫీ షూటర్‌ను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 ధర రూ.2,901 తగ్గింపు తర్వాత రూ.40,999గా ఉంది.
కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ డివైజ్ ధర రూ. 38,950కి తగ్గుతుంది. అంతేకాదు.. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 ఫోన్ రూ. 30వేల వరకు తగ్గింపును అందిస్తోంది. రూ.32,049 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్ నుంచి మీరు కేవలం రూ.8,950కే iPhone 11ని సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 11 ఇప్పటికీ అనేక ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.