Samsung Galaxy F54 5G Launch : కొత్త 5G ఫోన్ కావాలా? శాంసంగ్ నుంచి దిమ్మతిరిగే ఫీచర్లతో F54 సిరీస్.. కొంటే ఈ ఫోన్ కొనాలి!

Samsung Galaxy F54 5G Launch : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ F54 ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ ధర రూ. 30వేల లోపు ఉంటుంది. ఇటీవలే లాంచ్ అయిన గెలాక్సీ A34 మాదిరిగానే ఉంటుంది.

Samsung Galaxy F54 5G Launch : కొత్త 5G ఫోన్ కావాలా? శాంసంగ్ నుంచి దిమ్మతిరిగే ఫీచర్లతో F54 సిరీస్.. కొంటే ఈ ఫోన్ కొనాలి!

Samsung Galaxy F54 5G launched in India _ Price, sale, specs and more revealed

Samsung Galaxy F54 5G launch in India : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి గెలాక్సీ F54 ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ ధర రూ. 30వేల లోపు ఉంది. శాంసంగ్ గెలాక్సీ (Galaxy A34) ధరకు దగ్గరగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే.. ఈ ఫోన్ ఆల్ రౌండర్ ఫోన్. కొత్త (Samsung Galaxy F54) భారీ బ్యాటరీ, డిస్‌ప్లే, మిడ్-రేంజ్ Exynos చిప్, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

గెలాక్సీ F54 ధర, సేల్ ఎప్పుడంటే? :
శాంసంగ్ గెలాక్సీ F54 భారత మార్కెట్లో 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 27,999కు వస్తుంది. ఈ ఫోన్ రిటైల్ ధర రూ. 29,999 అని గమనించాలి. కొన్ని గంటల్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులోకి వస్తుంది. అదే ప్లాట్‌ఫారమ్ ద్వారా త్వరలో సేల్ ప్రారంభం కానుంది. భారత మార్కెట్లో ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది.

Read Also : Apple WWDC 2023 : ఆపిల్ విజన్ ప్రో.. ఇదో కొత్త రకం కంప్యూటర్.. కొత్త కంప్యూటింగ్ శకానికి నాంది అంటున్న సీఈఓ టిమ్ కుక్

శాంసంగ్ గెలాక్సీ F54 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
కొత్త శాంసంగ్ గెలాక్సీ F54 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో భారీ 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పనిచేసే AMOLED ప్యానెల్‌ను అందిస్తుంది. ఫోన్ స్క్రీన్ దెబ్బతినకుండా ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్‌ను కలిగి ఉంది. ప్రీ-అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ లేదు. బ్యాక్ కెమెరా డిజైన్ ఫ్లాగ్‌షిప్ Galaxy S23 ఫోన్‌ని పోలి ఉంటుంది. కంపెనీ హోమ్-బ్రూడ్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. ఇటీవల లాంచ్ అయిన గెలాక్సీ A34కి కూడా శక్తినిస్తుంది. ఈ 5G ఫోన్ సరికొత్త (Android 13 OS)లో రన్ అవుతోంది. శాంసంగ్ 4 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లను, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

Samsung Galaxy F54 5G launched in India _ Price, sale, specs and more revealed

Samsung Galaxy F54 5G launched in India _ Price, sale, specs

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. కొత్తగా లాంచ్ అయిన (Samsung Galaxy F54) వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. వీడియోల కోసం OISకి సపోర్టుతో 108MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్‌తో కలిసి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సింగిల్ సర్క్యులర్ కట్ అవుట్‌లో 32MP సెన్సార్ ఉంది. హుడ్ కింద, పెద్ద 6,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌ ఛార్జింగ్ ఒక రోజు కన్నా ఎక్కువ సమయం వస్తుంది.

శాంసంగ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందించింది. మార్కెట్‌లోని ఇతర ఫోన్‌లు అందిస్తున్న దానికంటే చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఛార్జర్‌తో అందించడం లేదు. శాంసంగ్ యూజర్లు ఛార్జర్ కొనుగోలు చేయడానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర పాత ఛార్జర్ ఉంటే ఉపయోగించవచ్చు. కంపెనీ ఫోన్‌తో పాటు ఫోన్ కేసును కూడా అందించదు. కొత్త శాంసంగ్ ఫోన్ Galaxy A54 స్మార్ట్‌ఫోన్‌లో కనిపించే ఇన్-డిస్ప్లే సెన్సార్‌కు బదులుగా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. గెలాక్సీ F54 దిగువన ఒకే స్పీకర్‌ను కలిగి ఉంది. ప్రాథమిక IP రేటింగ్ సపోర్టు లేదు.

Read Also : Apple iOS 17 Beta : ఆపిల్ ఐఓఎస్ 17 బీటా.. ఈ పాపులర్ ఐఫోన్లలో పనిచేయదట.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!