చార్మి బర్త్ డేకు ఎమోషనల్‌గా పూరీ జగన్నాథ్ 

  • Published By: Subhan ,Published On : May 17, 2020 / 01:41 PM IST
చార్మి బర్త్ డేకు ఎమోషనల్‌గా పూరీ జగన్నాథ్ 

Updated On : May 17, 2020 / 1:41 PM IST

ఎన్నో మలుపులు తిరిగిన చార్మీ కౌర్ కెరీర్.. హీరోయిన్, ప్రొడ్యూసర్‌గా పలు మైలు రాళ్లను దాటింది. సెన్సేషనల్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తో ప్రయాణం మొదలుపెట్టి ప్రొడ్యూసర్ గా మారింది. వీరి జర్నీలో జ్యోతి లక్ష్మీ, పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బాస్టర్లు వచ్చాయి. 

ఈ బ్యానర్ కు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాల్లోనూ ఛార్మి పిచ్చ యాక్టివ్ గా ఉంటుంది. ఆదివారం ఈమె బర్త్ డే సందర్భంగా పూరీ జగన్నాథ్ ట్వీట్ ద్వారా విషెస్ తెలియజేశాడు. నా ఇస్మార్ట్ ఫైటర్ నువ్వేనంటూ పొగిడేశాడు. మరి ఆ రెండు చిప్‌ల ఛార్మి గురించి మనకు పూర్తిగా తెలియకపోయినా ట్వీట్ మాత్రం ఎమోషనల్ గా ఉంది. 

‘నా ఇస్మార్ట్ ఫైటర్ ఛార్మికి హ్యాపీ బర్త్ డే. నీ జీవితం అంత సజావుగా సాగలేదని నాకు తెలుసు. నువ్వు ఎంత బలవంతురాలివో నాకు తెలుసు. మనం ఇంకా పరిగెత్తాలి. నువ్వు నన్ను గర్వపడేలా చేస్తావు. పూరీ కనెక్ట్స్‌కు నిజమైన బలం నువ్వే. ఇంకా విజయాలు చేరుకోవాలి. మరింత ఆరోగ్యంగా ఉండాలి. లెట్స్ రాక్ అండ్ రాక్ అండ్ రోల్’ అంటూ విషెస్ తెలిపాడు.