Sushi Terrorism: కప్పులు ఎంగిలి చేస్తూ రెస్టారెంట్‭లో పాడు పని.. జపాన్ యువకుడికి గట్టిగానే పడింది పిడి

రెస్టారెంటుకి వచ్చిన యువకుడు.. చుట్టు పక్కల ఎవరైనా వస్తున్నారా చూస్తూ అక్కడి కప్పులను నాకుతూ తిరిగి అక్కడే పెడుతున్నాడు. అంతే కాకుండా.. పక్కన ఉన్న ఆహార పదార్థాలను కూడా తన ఎంగిలిని అంటిస్తూ పాడు చర్యలకు పాల్పడ్డాడు

Sushi Terrorism: కప్పులు ఎంగిలి చేస్తూ రెస్టారెంట్‭లో పాడు పని.. జపాన్ యువకుడికి గట్టిగానే పడింది పిడి

Japan: కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. కొందరు చేసే పనులకు రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. జపాన్‭లో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. ఒక యువకుడు చేసిన పాడు పనికి రెస్టారెంట్ గట్టిగానే బుద్ధి చెప్పింది. రెస్టారెంటుకు వచ్చిన యువకుడు అక్కడ ఉన్న కప్పులను ఎంగిలి చేస్తూ వికారమైన చర్యకు పాల్పడ్డాడు. ఎవరూ చూడని సమయంలో ఇలా చేశాడు. అయితే దీన్ని వీడియో తీసుకోవడంతో దొరికిపోయాడు. ఈ వీడియో ఎవరు సోషల్ మీడియాలో షేర్ చేశారో తెలియదు కానీ, విషయం రెస్టారెంట్ యాజమాన్యం వరకు వెళ్లడంతో చర్యలకు పాల్పడింది.

Found a friend on Instagram : 18 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహాన్ని ఇన్‌స్టాగ్రామ్ కలిపింది

సదరు యువకుడికి అక్షరాల నాలుగు కోట్ల రూపాయలు (4,80,000 డాలటర్లు) జరిమానా విధించింది. ఇది ‘సుషీ ఉగ్రవాదం’ అని జపనీయులు విమర్శలు గుప్పిస్తున్నారు. జపాన్‭లో ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వారసలు ఆహారాన్ని చేతితో తాకడం చాలా తక్కువ. శుభ్రత వారి మొదటి ప్రాధాన్యత. ఆహారం విషయంలో అది మరీ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి చర్యల్ని వారు సుషీ ఉగ్రవాదం అంటారు. జపాన్‭లోని అకిండో సుషిరో కో అనే రెస్టారెంట్లో జరిగిన ఘటన ఇది.


వీడియో గమనిస్తే.. రెస్టారెంటుకి వచ్చిన యువకుడు.. చుట్టు పక్కల ఎవరైనా వస్తున్నారా చూస్తూ అక్కడి కప్పులను నాకుతూ తిరిగి అక్కడే పెడుతున్నాడు. అంతే కాకుండా.. పక్కన ఉన్న ఆహార పదార్థాలను కూడా తన ఎంగిలిని అంటిస్తూ పాడు చర్యలకు పాల్పడ్డాడు. దీన్నంతటినీ అతడి స్నేహితుడు ఒకరు వీడియో తీశారు. వాస్తవానికి ఈ సుషీ ఉగ్రవాదం జపాన్‭లో బాగా పెరిగింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇలాంటి వీడియోలకు ఆకర్షితులై చాలా మంది ఇలాంటి పాడు పనులు చేస్తున్నారట. కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు జపాన్‭లో చాలా కనిపించాయి. అయితే ఇలాంటివి వాస్తవం కాదని, ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) ఆధారంగా ఇలాంటి తయారు చేస్తున్నారని అని కొందరు అంటున్నారు.