కరెంట్ వైర్లతో జాగ్రత్త, లేదంటే ప్రాణాలకే ప్రమాదం.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

తాజాగా జరిగిన ఓ ఘటన అందరికీ వెన్నులో వణుకు పుట్టించింది. విద్యుత్ వైర్లు ఎంతో ఎత్తులో ఉన్నా.. ఆ వ్యక్తి ప్రాణం తీశాయి.

కరెంట్ వైర్లతో జాగ్రత్త, లేదంటే ప్రాణాలకే ప్రమాదం.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

Electrocuted : కరెంట్ వైర్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. విద్యుత్ వైర్లు యమపాశాలుగా మారుతున్నాయి. ప్రమాదవశాత్తు కరెంట్ వైరు తగిలి ఎంతో మంది చనిపోయారు, చనిపోతున్నారు. అందుకే, కరెంట్ వైర్లు ఉన్న చోట్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవి ఎంత ఎత్తులో ఉన్నా కేర్ ఫుల్ గా ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

తాజాగా జరిగిన ఓ ఘటన అందరికీ వెన్నులో వణుకు పుట్టించింది. విద్యుత్ వైర్లు ఎంతో ఎత్తులో ఉన్నా.. ఆ వ్యక్తి ప్రాణం తీశాయి. అతడి చిన్నపాటి నిర్ల్యక్షం ఏకంగా ప్రాణాలనే తీసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లాలోని జసౌదానగర్ లో ఘోరం జరిగింది. వేడుక జరగాల్సిన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వేడుక కోసం ఓ వ్యక్తి పొడవాటి పచ్చి వెదురు బొంగును నిటారుగా పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు. అయితే, పైన కరెంట్ వైర్లు ఉన్న సంగతి అతడు చూసుకోలేదు. దాంతో ఆ బొంగు విద్యుత్ వైర్లకు తగిలి అతడు కరెంట్ షాక్ తో స్పాట్ లోనే చనిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యుత్ వైర్లు ఉన్న దగ్గర పని చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికే ఈ ఘటనే నిదర్శనం.

మృతుడి పేరు దేవేంద్ర(37). తన బంధువు ఇంట్లో మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి అతడు వచ్చాడు. ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ప్రసాదం తయారు చేస్తుండగా, మరికొందరు ఆలయంలో పూజలకు అవసరమైన సామాగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, ఆచారంలో భాగంగా జెండా కట్టేందుకు వెదురు కర్రను తీసుకొచ్చాడు దేవేంద్ర. కాగా, వెదురు బొంగే అతడి పాలిట మృత్యువు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, వెదురు కర్ర తడిగా ఉంది. అది కరెంట్ వైర్లను తాకడం, వెంటనే షాక్ కొట్టడం, దేవేంద్ర చనిపోవడం.. అన్నీ క్షణాల వ్యవధిలోనే జరిగిపోయాయి.

Also Read : పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ..! ఏకంగా 50మందిని పెళ్లి చేసుకుంది, చివరికి ఆధార్ కార్డుతో అడ్డంగా దొరికిపోయింది..