పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ..! ఏకంగా 50మందిని పెళ్లి చేసుకుంది, చివరికి ఆధార్ కార్డుతో అడ్డంగా దొరికిపోయింది..

సంధ్య బండారాన్ని తిరువూరుకు చెందిన ఓ యువకుడు బయటపెట్టాడు.

పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ..! ఏకంగా 50మందిని పెళ్లి చేసుకుంది, చివరికి ఆధార్ కార్డుతో అడ్డంగా దొరికిపోయింది..

50 Marriages : ఈరోజుల్లో పెళ్లి జరగడమే కష్టంగా మారింది. పెళ్లి కాని ప్రసాదులు బోలెడు మంది ఉన్నారు. వివాహం కోసం పరితపించిపోతున్నారు. పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొందరు వెయిట్ చేసి చేసి డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోతున్నారు. అంతటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఓ మహిళ మాత్రం పెళ్లి మీద పెళ్లిళ్లు చేసుకుంది. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 50 మందిని పెళ్లాడింది. ఆమె ఎంత టాలెంటెడ్ అంటే.. పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ కూడా కొట్టింది. ఈరోజుల్లో ఒక పెళ్లి జరగడమే కష్టంగా ఉందంటే.. ఆమె ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకుంది. ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువతి లేడీ కాదు కిలేడీ. నిత్య పెళ్లి కూతురు. పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత డబ్బు, నగదుతో ఎస్కేప్ అవడం.. ఇదీ ఆమె తీరు. చివరికి ఆమె పాపం పండింది. పోలీసులకు చిక్కింది.

తమిళనాడులో నిత్య పెళ్లి కూతురి బాగోతం ఆలస్యగా వెలుగులోకి వచ్చింది. సంధ్య అనే యువతి 50 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. ఒక్కో పెళ్లికి ఒక్కో పేరు.. ఇలా 50 మందిని వివాహం చేసుకుంది. పెళ్లి అయిన రెండు మూడు రోజుల్లో డబ్బు, నగలతో ఉడాయించేది. డేట్ ద తమిళ్ వే అనే వెబ్ సైట్ లో తన ప్రొఫైల్ ఉంచి యువకులకు వల వేసిన సంధ్య.. డీఎస్పీ, ఎస్ఐ, ఫైనాన్షియర్లను కూడా మోసం చేసింది. సంధ్య బండారాన్ని తిరువూరుకు చెందిన ఓ యువకుడు బయటపెట్టాడు. సంధ్యతో పెళ్లైన మరుసటి రోజే ఆమెపై అనుమానంతో ఆధార్ కార్డు పరిశీలించాడు. అయితే, అందులో సంధ్య భర్తగా మరో వ్యక్తి పేరు ఉండటంతో కూపీ లాగాడు. దీంతో సంధ్య బండారం మొత్తం బయటపడింది.

పెళ్లి పేరుతో 50 మంది యువకులను యువతి మోసం చేసిన ఉదంతం సంచలనంగా మారింది. సంధ్య బాధితుల్లో పోలీసులు కూడా ఉండటం షాక్ కి గురి చేసే అంశం. డీఎస్పీ, ఎస్ఐ, పలువురు ఫైనాన్షియర్లు మోసపోయిన వారిలో ఉన్నారు. మాయమాటలు చెప్పి వారందరిని పెళ్లి చేసుకుంది సంధ్య. పెళ్లి తర్వాత మొదటి రెండు రాత్రులు గడిచాక.. మూడో రోజు పెళ్లింట్లో ఉన్న డబ్బు, నగదుతో ఉడాయించేది. మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో తన అందమైన ఫొటోలు ఉంచి చాలామంది యువకులను ట్రాప్ చేసింది. వారిని పెళ్లాడి ఆ తర్వాత అందినకాడికి దోచుకుని ఎస్కేప్ అయ్యేది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 50 మంది యువకులు సంధ్య చేతిలో నిలువునా మోసపోయారు.

చివరికి తిరువూరుకు చెందిన ఓ యువకుడు సంధ్య బండారాన్ని బయటపెట్టాడు. పెళ్లి అయ్యి మొదటి రాత్రి గడిచాక అనుకోకుండా అతడికి సంధ్య ఆధార్ కార్డు దొరికింది. అందులో సంధ్య భర్తగా మరో వ్యక్తి పేరు ఉండటంతో అతడు షాక్ కి గురయ్యాడు. సంధ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగగా సంధ్య గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. సంధ్య బాధితుల్లో 50 మంది యువకులు ఉన్నట్లు తెలిసి కంగుతిన్నారు. పెళ్లి పేరుతో అక్రమాలకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు సంధ్యను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read : డ్రైనేజీలో పడిపోయిన బాలుడు.. 3 రోజుల తర్వాత అతడి మృతదేహం ఎలా దొరికిందో తెలుసా?