పానీపూరి కోసం టీవీ ముందు నిలబడి అడుక్కుంటున్న బిగ్‌బాస్ భామ: ఏం పాట్లురా బాబూ..

  • Published By: nagamani ,Published On : May 18, 2020 / 09:35 AM IST
పానీపూరి కోసం టీవీ ముందు నిలబడి అడుక్కుంటున్న బిగ్‌బాస్ భామ: ఏం పాట్లురా బాబూ..

Updated On : October 31, 2020 / 2:12 PM IST

బిగ్ బాస్-3 నటి హిమజ తన స్మార్ట్ టీవీ ముందు నిలబడి.. టీవీలో పానీపూరి బండివాడిని పిలుస్తూ తనకు కూడా పానీపూరి వేయమని అభ్యర్థిస్తోంది. కాదు కాదు ఆ అడిగే తీరు చూస్తే..దాదాపు అడుక్కుంటోందో అన్నట్లుగా ఉంది. ఈ వీడియో చూసే ముందు ఆ సంగతులేంటో తెలుసుకుందాం..

పానీ పూరి పేరు చెబితే చాలు నోట్లో నీళ్లు ఊరిపోతాయి. పానీ పూరి కావాలంటే పానీ పూరి బండి దగ్గరకెళ్లాలి. కానీ  టీవీ ముందు నిలబడి..ప్లీజ్..నాకూ పానీ పూరి ఇవ్వవా? అంటూ బండి అబ్బాయిని  అడిగితే ఎలా ఉంటుంది? ఇదేంటీ..ఎంత స్మార్ట్ టీవీ అయితే మాత్రం పానీపూరీలను ఇస్తుందా ఏమిటీ? ఇది మరీ చోద్యంగా ఉంది అని అనిపిస్తోంది కదూ..మరి బిగ్ బాస్ సీజన్-3లో వచ్చిన నటి హిమజ ఏంటీ.. తన స్మార్ట్ టీవీ ముందు ఓ బౌల్ తో  నిలబడి ‘‘ప్లీజ్..పానీ పూరీ బండి అబ్బాయ్..నాక్కూడా పానీ పూరీ  ఇవ్వవా..ఆకలేస్తోంది’ అంటూ  అడుగుతోంది.

కాదు కాదు అలా అడుగుతున్న తీరు చూస్తే అడుడుక్కుంటున్న లెవల్ కి పడిపోయినట్లుగా ఉంది…ఈ సిత్రం ఏటో మీరు లుక్కేయండి..తన ఇన్ స్టాగ్రామ్ లో హిమజ షేర్ చేసిన ఈ వీడియో ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టేసుకుంటోంది. కాగా..కరోనా కల్లోలంతో పానీపూరీ షాప్స్ పూర్తిగా బంద్ అయిపొయినా..బిగ్ బాస్ ఫేమ్ హిమజ వీడియో తెగ వైరల్ అయిపోతోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#cravings #panipuri #food #hungry #tiktokindia #telugutiktok #funny #fun #smile #teluguactress

A post shared by Himaja Mallireddy (@itshimaja) on

Read :  సంఘవి కూతురు ఫొటో వైరల్