సంఘవి కూతురు ఫొటో వైరల్

  • Published By: madhu ,Published On : May 17, 2020 / 09:24 AM IST
సంఘవి కూతురు ఫొటో వైరల్

Updated On : May 17, 2020 / 9:24 AM IST

టాలీవుడ్ లో సింధూరం సినిమాతో గుర్తింపు పొందిన నటి సంఘవి గుర్తుండే ఉంటుంది కదా.. దాదాపు 45కు పైగా సినిమాలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా తర్వాత..ఈ నటి..కొన్ని కన్నడ, తమిళ సినిమాల్లో నటించింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్ తో పాటు ఇతర హీరోలతో నటించింది. పెళ్లి చేసుకున్న తర్వాత..ఎక్కడా కనిపించలేదు. తాజాగా సంఘవికి సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. 

సంఘవి అసలు పేరు కావ్య. శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. తమిళ సినిమాలో అయరావతి ఫస్ట్ సినిమా. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ…39 ఏళ్ల వయస్సులో ఓ బిజినెస్ మెన్ ను వివాహం చేసుకుని…హాయిగా జీవితం గడిపేస్తోంది. జబర్దస్త్, ఇతర ఎపిసోడ్స్ కు జడ్జీగా వచ్చి అలరించారు.

సంఘవి ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా ఓ పండండి బిడ్డకు ఈమె జన్మనిచ్చారని సమాచారం. సంఘవి ఒడిలో అమాయకపు చూపులు చూస్తున్న చిన్నారితో దిగిన ఈ ఫొటో వైరల్ గా మారింది.