Cyclone Biparjoy : నేడు తీరం దాటనున్న బిపర్‌జోయ్ తుపాన్..74వేల మంది తరలింపు

బిపర్‌జోయ్ తుపాన్ గురువారం సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. గుజరాత్ సముద్ర తీరాన్ని తుపాన్ సమీపిస్తున్నందున భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణకేంద్రం వెల్లడించింది....

Cyclone Biparjoy : నేడు తీరం దాటనున్న బిపర్‌జోయ్ తుపాన్..74వేల మంది తరలింపు

Cyclone Biparjoy

Cyclone Biparjoy To Make Landfall Today : బిపర్‌జోయ్ తుపాన్ గురువారం సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. గుజరాత్ సముద్ర తీరాన్ని తుపాన్ సమీపిస్తున్నందున భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణకేంద్రం వెల్లడించింది. కచ్ జిల్లాలో తుపాన్ గురువారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నందున గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 74,000 మందిని షెల్టర్లకు తరలించారు. (74,000 Evacuated) సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో నిన్న అతి భారీ వర్షం కురిసింది. తీవ్రమైన తుపాన్ ప్రభావం వల్ల గంటకు గరిష్ఠంగా 130కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ(India Meteorological Department) అధికారులు చెప్పారు.

Uniform Civil Code: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం

గుజరాత్ రాష్ట్రంలోని (Gujarat coast)కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) కు చెందిన 15 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్) 12, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన 397 బృందాలను రంగంలోకి దింపినట్లు గుజరాత్ సహాయ పునరావాస కమిషనర్ అలోక్ కుమార్ పాండే తెలిపారు. గుజరాత్ రాష్ట్ర కోస్తా జిల్లాల్లో ఉద్యోగులకు తగిన సంరక్షణ కల్పించి, ఆహారం, మందులు ఉండేలా చూడాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారికి సూచించారు.తుపాన్ వల్ల ప్రాణ నష్టం, మత్స్య సంపద, పశువులు, పంటలు, పడవలు, ఆస్తి నష్టాల నుంచి ఉత్పన్నమయ్యే క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని సీనియర్ బ్యాంక్ అధికారులు, బీమా సంస్థల సమావేశంలో మంత్రి కోరారు.

Pawan Kalyan: అమరావతిలోనే ఆంధ్ర రాజధాని

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో మాట్లాడి తుపాన్ తీరం దాటే సమయంలో సాయుధ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని ట్వీట్ చేశారు.164 సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కచ్‌లో ఆరోగ్యశాఖ అధికారులను సిద్ధంగా ఉంచారు. భారత వైమానిక దళానికి చెందిన గరుడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు వచ్చింది.

పాన్ కార్డు ఉన్న వారికి బిగ్ అలర్ట్

తుపాన్ ఈశాన్య దిశగా కదులుతూ సౌరాష్ట్ర, కచ్, గుజరాత్‌లోని మాండ్వీ, పాకిస్థాన్‌లోని కరాచీ మధ్య జఖౌ పోర్ట్‌కు సమీపంలో ఉన్న పాకిస్థాన్ తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్, సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. గుజరాత్,మహారాష్ట్రలలో తుపాను తీరం దాటే ముందు సహాయ చర్యలు చేపట్టడానికి 33 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది.