Heavy Rain Alert : ఇళ్లలోనే ఉండండి..ప్రజలకు హిమాచల్ సీఎం హెచ్చరిక

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షాలు కురుస్తున్నదున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు....

Heavy Rain Alert : ఇళ్లలోనే ఉండండి..ప్రజలకు హిమాచల్ సీఎం హెచ్చరిక

Heavy Rain Alert

Heavy Rain Alert : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షాలు కురుస్తున్నదున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. (Himachal Chief Minister’s Stay Indoors) 1100. 1070, 1077 ల నంబర్లతో మూడు హెల్ప్ లైన్ లను ప్రారంభించామని సీఎం చెప్పారు.

Richest Cricketers : దేశంలో అత్యంత ధనిక క్రికెటర్లు ఎవరంటే…

తాను సహాయం చేయడానికి 24 గంటలూ అందుబాటులో ఉంటానని, ప్రజలు ఈ విపత్తు సమయంలో హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ కాల్ చేయాలని సీఎం కోరారు. (Amid Heavy Rain Alert) శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో క్యాంపులు వేసి ప్రజలకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ‘‘దయచేసి ఈ విపత్తు సమయంలో ప్రజలకు సహాయం చేయండి, వారి నష్టాలకు పరిహారం అందేలా చూడండి’’ అని సీఏం సుఖు కోరారు.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన 100 ఏళ్ల నాటి వంతెన

ఈ వరద విపత్తు వల్ల ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారని, గల్లంతైన వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం వివరించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు విపత్తు రెస్పాన్స్ బలగాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం, వరదల యొక్క భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మనాలి, కులు, కిన్నైర్, చంబా ప్రాంతాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి.