Richest Cricketers : ఇండియాలో అత్యంత ధనిక క్రికెటర్లు ఎవరంటే…

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల్లో భారతీయ క్రికెటర్లు ఉన్నారని అందరూ భావిస్తారు. భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల ఆస్తుల నికర విలువ రూ.1,000 కోట్లకుపైగా ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి....

Richest Cricketers : ఇండియాలో అత్యంత ధనిక క్రికెటర్లు ఎవరంటే…

Richest Cricketers

Richest Cricketers : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల్లో భారతీయ క్రికెటర్లు ఉన్నారని అందరూ భావిస్తారు. భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల ఆస్తుల నికర విలువ రూ.1,000 కోట్లకుపైగా ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. (Virat Kohli, MS Dhoni, Sachin Tendulkar) ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు అయిన ఆర్యమాన్ బిర్లా, సమర్జిత్‌సిన్హ్ రంజిత్‌సిన్హ్ గైక్వాడ్‌ (Samarjitsinh Ranjit Singh Gaikwad)లతో పోలిస్తే దిగ్గజ క్రికెటర్ల సంపాదన చాలా తక్కువగా ఉంది. ఆర్యమాన్ బిర్లా, సమర్జిత్‌సిన్హ్ రంజిత్‌సిన్హ్ గైక్వాడ్‌ ఆస్తుల నికర విలువ రూ. 90,000 కోట్లకు పైగా ఉంది.

బిర్లా వారసుడు.. క్రికెటర్
ఆర్యమాన్ బిర్లా నిష్ణాతుడైన క్రికెటరే కాదు అతి పెద్ద వ్యాపార వారసుడు కూడా. (Richest Cricketers Have Net Worth Of Over Rs 90,000 Crore) ఆర్యమాన్ బిర్లా 2017-18 రంజీ ట్రోఫీ సీజనులో మధ్యప్రదేశ్ రాష్ట్రం తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశారు. 2018వ సంవత్సరంలో ఆర్యమాన్ తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని కూడా సాధించారు. ఆర్యమాన్ బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, బిలియనీర్ భారతీయ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. ఆదిత్య బిర్లా గ్రూప్ నికర విలువ రూ. 4.95 లక్షల కోట్ల రేంజ్‌లో ఉంది. గ్రూప్‌లో గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. గ్రూప్‌లో 1,40,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

ఆర్యమాన్ బిర్లా సెంచరీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2018లో ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించకముందే ఆర్యమాన్ బిర్లాను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆర్యమాన్ ఒక సెంచరీ, 1 ఫిఫ్టీతో 414 పరుగులు సాధించారు. 2019 వ సంవత్సరం తర్వాత మానసిక ఆరోగ్య కారణాల వల్ల ఆర్యమాన్ క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘‘ క్రికెట్ కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకోవడానికి నా కృషి, పట్టుదల, అంకితభావం, అపారమైన ధైర్యం కారణం. అయితే, నేను కొంతకాలంగా క్రీడలకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనతో పోరాడుతున్నాను’’ అని ఆర్యమాన్ బిర్లా ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో రాశారు.

సమర్జిత్‌సిన్హ్ రంజిత్‌సింగ్ గైక్వాడ్ ఎవరంటే..
సమర్జిత్‌సిన్హ్ 1967 వ సంవత్సరం ఏప్రిల్ 25 వతేదీన రంజిత్‌సిన్హ్ ప్రతాప్‌సిన్హ్ గైక్వాడ్, శుభాంగినీరాజేలకు ఏకైక కుమారుడిగా జన్మించాడు. ఇతను డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో చదువుకున్నాడు. అక్కడ అతను పాఠశాల క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ జట్లకు ఏకకాలంలో కెప్టెన్‌గా ఉన్నారు. 2012వ సంవత్సరం మే నెలలో తన తండ్రి మరణించిన తర్వాత, 2012న జూన్ 22వతేదీన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో జరిగిన సంప్రదాయ వేడుకలో సమర్జిత్‌సిన్హ్ మహారాజాగా పట్టాభిషేకం అయ్యారు. ఇతనికి రూ. 20,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులున్నాయి.

ఎన్నెన్నో ప్యాలెస్‌లు..
సమర్జిత్‌సిన్హ్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్, వడోదరలోని మోతీ బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియంతో సహా ప్యాలెస్ సమీపంలోని 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్, బంగారం వంటి చర ఆస్తులు, వెండి, రాజ ఆభరణాలున్నాయి. గుజరాత్‌, బనారస్‌లోని 17 దేవాలయాల ఆలయ ట్రస్టులను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. సమర్జిత్‌సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు నలుగురూ భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో నివసిస్తున్నారు.

Virat Kohli,Sachin Tendulkar, MS Dhoni

Virat Kohli, Sachin Tendulkar, MS Dhoni

విరాట్ కోహ్లీ నికర విలువ రూ.1,000 కోట్లకుపైనే..
తాజా నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ రూ.1,050 కోట్లు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ కోహ్లీ రూ. 15 కోట్లు సంపాదించారు. భారత క్రికెట్ జట్టు నుంచి సంపాదన విషయానికి వస్తే, కోహ్లి ఒక టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, ఒక్కో వన్డేకు రూ.6 లక్షలు, టీ20 ఆడినందుకు రూ.3 లక్షలు అందుకుంటారు.