Hari Hara Veera Mallu : షూటింగ్ మొదలుపెట్టిన ‘హరిహర వీరమల్లు’.. పవన్ ఎప్పుడు జాయిన్ అవుతాడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'హరి హర వీర మల్లు'.

Pawan Kalyans Hari Hara Veera Mallu shooting update
Hari Hara Veera Mallu shooting update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. చాన్నాళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే.. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఆగస్టు 14 (బుధవారం) నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని చిత్ర బృందం తెలియజేసింది.
ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపింది. 400 నుంచి 500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఈ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని మూవీ యూనిట్ తెలియజేసింది.
KALKI 2898AD : సంధ్య థియేటర్‌లో కల్కి 50 డేస్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను అందుకున్న తరువాత, ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులలో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.