అమెరికాలో మరో దారుణం…వృద్ధుడిపై పోలీసుల క్రూరత్వం
మిన్నియాపొలిస్ సిటీ పోలీసుల పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు “జార్జ్ ఫ్లాయిడ్(46)”కి మద్దతుగా అమెరికాలో ఆఫ్రో-అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. 10 రోజులుగా అగ్రరాజ్యంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. ఈ క్రమంలో నిరసనలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన న్యూయా రాష్ట్రంలోని బఫెలో సిటీ పోలీసులు… ఓ సీనియర్ సిటిజన్ ను తోసేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
స్థానిక పబ్లిక్ రేడియో స్టేషన్ WDFOకి చెందిన ఓ రిపోర్టర్ తీసిన ఈ వీడియోలో…నిరసన తెలుపుతున్న 75ఏళ్ల వయస్సు ఉన్న ఓ తెల్ల జుట్టు వ్యక్తి బఫెలో పోలీసుల కవాతుకు అడ్డుగా వచ్చి ఏదో చెప్పబోయాడు. దాంతో కవాతులోని ఓ పోలీసు అతన్ని లాఠీతో నెట్టేశాడు. మరో పోలీసు కూడా చేత్తో బలంగా తోయడంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. అతను బలంగా నేలను తాకడంతో తలకు బలమైన గాయమై రక్తం స్రావమైంది. అయినప్పటికీ ఆ పోలీసులు కనికరించలేదు. అతనిపై దాడికి యత్నించారు.
అంతలోనే మిగతా పోలీసులు వారిని వారించి అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు రికార్డ్ అయింది. సమీపంలో ఉన్న మెడికల్ సిబ్బంది స్పందించి ఆ వృద్ధ నిరసకారుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారని WDFO తెలిపింది. యపడిన వ్యక్తి పరిస్థితి నిలకడ ఉందని తెలిపింది. కాగా,ఈ ఘటనపై బఫెలో మేయర్ బైరోన్ బ్రౌన్ స్పందించారు. ఈ వీడియో చూసి తాను చాలా బాధపడినట్లు తెలిపారు.
శాంతియుత నిరసనలు…పోలీసులు,తనకు,కమ్యూనిటీ సభ్యులకు మధ్య పలు సమావేశాలు తర్వాత జరిగిన ఈ ఘటన తనను చాలా బాధించిందన్నారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి సీరియస్ గా ఉందని,ఈరీ కౌంటీ మెడికల్ సెంటర్ హాస్పిటల్ లో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు బ్రౌన్ తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో..పోలీసుల క్రూరత్వాన్ని ఖండిస్తూ అమెరికాలోని పలు సిటీల్లో ఆందోళనకారులు తిరిగి రోడ్లపైకి నిరసనలకు దిగారు. వృద్ధుడిపై క్రూరంగా ప్రవర్తించిన ఇద్దరు పోలీసులు వేతనం లేని సస్పెన్షన్ కు గురయ్యారు.
This is so difficult to watch but I urge you to if you can.
An elderly man pushed over by Buffalo PD…he’s bleeding.
An officer leans down and is told to move on by another officer.
Then the Buffalo PD tells the media that the man tripped…which is a clear lie
via @WBFO pic.twitter.com/pOfpCHOq3m
— Yashar Ali ? (@yashar) June 5, 2020
Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘George Floyd Challenge’ హ్యాష్ ట్యాగ్