Road Accident : సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా ..

Road Accident : సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident Suryapet District : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ పట్టణం పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో పది మంది ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read : Sale of IPL Tickets : ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు.. స్టేడియాన్ని ముట్టడిస్తాం..!

బ్రేక్ డౌన్ కావడంతో లారీని రోడ్డుపక్కన నిలిపి ఉంచారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.

Also Read : Jhalawar Road Accident : పెళ్లి బృందం వ్యాన్ ను ఢీకొట్టిన ట్రక్కు.. తొమ్మిది మంది మృతి

రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్లవారు జామున 4:30 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. లారీ బ్రేక్ డౌన్ కావడంతో హైవేపక్కన నిలిపి ఉంచడం జరిగిందని, ఎర్టీగా వెహికల్ వేగంగా వచ్చి వెనకనుంచి లారీని ఢీకొందని తెలిపారు. ప్రమాద సమయంలో ఎర్టిగా కారులో పదిమంది ఉన్నారు. ఆరుగురు స్పాట్ లో మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయని తెలిపారు.

వరుస ప్రమాదాలపై హైవే అధికారులతో సమావేశం నిర్వహించామని, ప్రమాదాల నివారణకు సూచనలు చేశామని ఎస్పీ అన్నారు. కొత్త బ్లాక్ స్పాట్స్ గుర్తిస్తున్నామని, వేగ నియంత్రణకు కొన్ని ప్రాంతాల్లో స్పీడ్ గన్స్ పెట్టామని చెప్పారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్లేస్ లలో వాహనాల వేగం తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.