Jhalawar Road Accident : పెళ్లి బృందం వ్యాన్ ను ఢీకొట్టిన ట్రక్కు.. తొమ్మిది మంది మృతి

ఝులావర్ జిల్లాలోని అక్లెరా పట్టణంలో ఓ యువకుడి వివాహ వేడుకకు హాజరైన శనివారం రాత్రి 10 మంది స్నేహితులు మారుతీ వ్యాన్ లో అక్లెరాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Jhalawar Road Accident : పెళ్లి బృందం వ్యాన్ ను ఢీకొట్టిన ట్రక్కు.. తొమ్మిది మంది మృతి

Jhalawar Road Accident

Updated On : April 21, 2024 / 10:00 AM IST

Rajasthan : రాజస్థాన్ లోని ఝులావర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వ్యాన్ ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతిచెందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెళ్లి వేడుకలో పాల్గొని.. తిరిగి వస్తుండగా ఝలావర్ జిల్లా అక్లెరా సమీపంలోని NH-52పై ఖురి పంచోలా వద్ద ట్రక్కు ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలతో వ్యాన్ లో ఉన్నవ్యక్తిని బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Also Read : Choclates : బాబోయ్.. చాక్లెట్లు తిని రక్తం కక్కుకుని చిన్నారి మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాకే

ఝులావర్ జిల్లాలోని అక్లెరా పట్టణంలో ఓ యువకుడి వివాహ వేడుకకు హాజరైన శనివారం రాత్రి 10 మంది స్నేహితులు మారుతీ వ్యాన్ లో అక్లెరాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఘటనపై ఝులావర్ ఎస్పీ రిచా తోమర్ మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా 18 నుంచి 35ఏళ్లలోపు వారే.