Justice Rohit B Deo: ‘‘నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయను’’ అంటూ ఉన్నపళంగా రాజీనామా చేసిన హైకోర్టు జడ్జీ

తన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన బాంబే హైకోర్టు జడ్జిగా జూన్ 2017లో నియమితులయ్యారు. అంతకు ముందు 2016లో మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పని చేశారు.

Justice Rohit B Deo: ‘‘నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయను’’ అంటూ ఉన్నపళంగా రాజీనామా చేసిన హైకోర్టు జడ్జీ

Nagpur: బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ బీ దేవ్ శుక్రవారం నాగ్‌పూర్ బెంచ్ ముందు తన రాజీనామా సమర్పించారు. దీనికి ముందు తన కొలీగ్స్‭కి క్షమాపణలు చెప్పారు. తన ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనని అన్నారు. అంతే కాకుండా తాను ఎవరినీ బాధపెట్టలేనని, తాను ఎవరినీ తిట్టనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామాను రోహిత్ ప్రకటించిన సమయంలో పలువురు న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు.

Rahul Gandhi: సుప్రీంలో ఊరట సరే.. ఇంతకీ రాహుల్ గాంధీ సభ్యత్వం ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది?

బార్ బెంచ్ ప్రకారం, జస్టిస్ రోహిత్ తన రాజీనామా సమయంలో స్పందిస్తూ.. ‘కోర్టుకు హాజరైన మీ అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. మీరు బాగుపడాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నేను ఎవరినీ తిట్టను. మీలో ఎవరినీ బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరందరూ నాకు కుటుంబం లాంటి వారు. నన్ను క్షమించండి. నేను రాజీనామా చేస్తున్నట్లు మీకు తెలియజేస్తున్నాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నేను పని చేయలేను. మీరు కష్టపడి పని చేస్తారని నమ్మకంతో ఉన్నాను’’ అని అన్నారు. కాగా, రాజీనామా అనంతరమే ఆయన జాబితా నుంచి అన్ని కేసులను తొలగించారు.

Seema Haider: సీమా హైదర్‭ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? టికెట్ ఇస్తానంటున్న అథవాలే.. ఎక్కడి నుంచో తెలుసా?

తన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన బాంబే హైకోర్టు జడ్జిగా జూన్ 2017లో నియమితులయ్యారు. అంతకు ముందు 2016లో మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పని చేశారు. నిజానికి ఆయన 2025లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. తన నిర్ణయాలతో ఆయన చాలాసార్లు వార్తల్లో నిలిచారు. 2022లో మావోయిస్టులతో లింకులున్నాయన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, దివ్యాంగుడైన జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ ఆయన తీర్పు చెప్పారు. మాజీ ప్రొఫెసర్‌ అయిన సాయిబాబాకు దిగువ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.