Disability Quota Row: స్మితా సబర్వాల్ ట్వీట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

వికలాంగుల రిజర్వేషన్లపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు..

Disability Quota Row: స్మితా సబర్వాల్ ట్వీట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Deputy CM Bhatti Vikramarka

Updated On : July 23, 2024 / 3:02 PM IST

Dy CM Mallu Bhatti Vikramarka : వికలాంగుల రిజర్వేషన్లపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆమెపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాజా ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. అసెంబ్లీ లాబీలో భట్టి మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. రుణమాఫీపై ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రుణమాఫీపై హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడొద్దంటూ ప్రతిపక్ష పార్టీల నేతలపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ ట్వీట్ పైనా భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : KTR Reaction on Budget 2024 : ఆ రెండు రాష్ట్రాలకేనా.. కేంద్ర బడ్జెట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఏం సంబంధం అంటూ భట్టి విక్రమార్క అన్నారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. దీంతో స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ప్రభుత్వానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చినట్లయింది. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రతీ అంశంలో ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నామని భట్టి పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వ విద్యకంటే బెటర్ విద్యను అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు.

Also Read : కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ నేతల ప్రశంసలు.. రాజధాని అమరావతి పనులు పరుగులు పెడతాయని..

ఒక్కో పాఠశాలకోసం 80 నుంచి 100కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయబోతోందని, ఒక్రేజ్, బిర్లా ఓపెన్ స్కూల్స్ టైప్ ప్రభుత్వ పాఠశాలలు రాబోతున్నాయని, ప్రతీ మండలానికి రెండు లేదా మూడు తొలుత రాబోతున్నాయని భట్టి చెప్పారు. బీఏసీ లో బీఆర్ఎస్ నాయకులు పేర్లు మార్చుకున్నారు.. అందుకే లేట్ అయిందని చెప్పారు.

Also Read : స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన టీడీపీ నేత.. క్షమాపణ చెప్పాలని డిమాండ్