Reliance Jio Plans : జియో యూజర్లకు పండగే.. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. మరెన్నో బెనిఫిట్స్ కూడా!

Reliance Jio Plans : కొత్త రూ.999 ప్లాన్ టారిఫ్ పెంపుకు ముందు వ్యాలిడిటీతో పాటు అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీని అందించింది. ఇప్పుడు, కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 999 ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

Reliance Jio Plans : జియో యూజర్లకు పండగే.. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. మరెన్నో బెనిఫిట్స్ కూడా!

Reliance Jio back its Rs 999 and Rs. 349 prepaid plans ( Image Source : Google )

Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో సహా టెలికాం ఆపరేటర్లు ఇటీవల మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచేశాయి. జియో తమ యూజర్ల కోసం ప్లాన్‌ల ధరను లాంగ్ వ్యాలిడిటీతో సహా దాదాపు 10 నుంచి 27 శాతం వరకు పెంచింది. అయితే, ప్లాన్‌లలోని అన్ని మార్పుల తర్వాత జియో ఇప్పుడు రూ. 999 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది.

రూ. 999 ప్లాన్ డేటా వివరాలివే :
కొత్త రూ.999 ప్లాన్ టారిఫ్ పెంపుకు ముందు వ్యాలిడిటీతో పాటు అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీని అందించింది. ఇప్పుడు, కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 999 ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులకు అదనంగా 14 రోజులు వ్యాలిడిటీ ఇస్తుంది. కానీ, ఎక్కువ కాలం వ్యాలిడిటీని అందించడానికి జియో రోజువారీ డేటాను తగ్గించింది. అంతకుముందు 3జీబీ నుంచి మొత్తంగా 252జీబీ డేటాను అందించేది. ఈ ప్లాన్ ఇప్పుడు రోజుకు 2జీబీ డేటా మాత్రమే అందిస్తుంది. మొత్తం వ్యాలిడిటీ వ్యవధిలో 196జీబీ డేటాను అందిస్తుంది.

ఈ జియో ప్లాన్ 2జీబీ రోజువారీ డేటా లిమిట్ అందిస్తుంది. జియో ట్రూ 5జీ సర్వీసు ఉన్న ప్రాంతాలలో వినియోగదారులకు 5జీ యాక్సెస్‌ను అందిస్తుంది. 5G సపోర్టెడ్ డివైజ్‌లను కలిగిన వినియోగదారులు ఈ ప్లాన్‌తో అన్‌‌లిమిటెడ్ 5జీ డేటా యాక్సెస్‌ని పొందవచ్చు. డేటా ప్రయోజనాలతో పాటు రూ. 999 ప్లాన్ రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. వినియోగదారులకు పూర్తి కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఫీచర్‌లు డేటా, వాయిస్ సర్వీసులు రెండింటినీ కోరుకునే కస్టమర్‌లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Jio New Annual Plan : జియో యూజర్ల కోసం కొత్త వార్షిక ప్లాన్లు.. నెలకు రూ.276.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ :
మరో టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ జియోకు పోటీగా రూ. 979 ప్లాన్‌ను అందిస్తుంది. ఇందులో రోజుకు 2జీబీ డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. అన్నీ 84 రోజులు చెల్లుతాయి. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా ఉంది. కస్టమర్లకు అదనపు వాల్యూను అందించేలా 56 రోజుల పాటు ఫ్రీ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కూడా అందిస్తుంది. జియో ఇతర 5జీ డేటా ప్లాన్‌ల విషయానికొస్తే.. ఎయిర్‌టెల్, జియో రెండూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తూనే ఉన్నాయి.

రోజుకు కనీసం 2జీబ 4జీ డేటాతో ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. జియో కనీస నెలవారీ ప్లాన్ ధర రూ. 349, అయితే ఎయిర్‌టెల్ ధర రూ. 379కు పొందవచ్చు. 5జీ యాక్సెస్‌ కోసం ఈ రెండు కంపెనీలు రోజుకు 1జీబీ నుంచి 1.5జీబీ 4జీ డేటాతో ప్లాన్‌లపై వినియోగదారులకు 5జీ బూస్టర్ ప్లాన్‌లను అందిస్తాయి. రూ. 51, రూ. 101, రూ. 151 ధర కలిగిన ఈ బూస్టర్‌లు అదనపు 4జీ డేటాను అందిస్తున్నాయి.

జియో రూ. 349 ప్లాన్ వ్యాలిడిటీ పెంపు :
రిలయన్స్ జియో అధికారిక హ్యాండిల్ ఎంట్రీ-లెవల్ ప్లాన్ ప్రకటించింది. కంపెనీ ట్రూ 5జీ సర్వీసును కలిగి ఉన్న ప్రాంతాలలో అన్‌లిమిటెడ్ 5జీ అందిస్తుంది. జియో యూజర్లు 28 రోజులకు బదులుగా 30 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అందించిన రోజువారీ డేటా రూ.349కి రోజుకు 2జీబీ అందిస్తుంది. మొత్తం డేటా మునుపటి 56జీబీకి బదులుగా 60జీబీకి పెరిగింది. అదనంగా, జియో 5జీ సర్వీసును అందించిన ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్ యాక్సెస్‌ను పొందవచ్చు.

కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌తో జియో ఈ ప్లాన్ రివైజ్ చేసింది. భవిష్యత్తులో ఏవైనా ఇతర ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను సవరించనుందో లేదో కంపెనీ పేర్కొనలేదు. అంతకుముందు రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 299గా ఉండేది. టారిఫ్ పెంపు తర్వాత ఇప్పుడు ఆ ప్లాన్ ధర రూ.349కు అందిస్తోంది.

Read Also : JioTag Air Launch : భారత్‌లో జియోట్యాగ్ ఎయిర్ ఇదిగో.. ప్రారంభ ధర రూ. 1,499 మాత్రమే..!