Britain : భారత్‌ను పాలించిన బ్రిటీష్ గడ్డపై భారత స్వాతంత్య్ర సంబరాలు .. మారు మోగిన ‘జనగణమన’

Britain : భారత్‌ను పాలించిన బ్రిటీష్ గడ్డపై భారత స్వాతంత్య్ర సంబరాలు .. మారు మోగిన ‘జనగణమన’

Jana Gana Mana in Britain

Jana Gana Mana in Britain : భారతదేశాన్ని 200ల ఏళ్లు పాలించిన బ్రిటీష్ గడ్డపై భారత జాతీయ గీతం ‘జనగణమన’ (Jana Gana Mana)మారుమోగింది. ‘జనగణమన ఎప్పుడూ విన్నా.. భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. మనకు తెలియకుండానే ఉన్నచోటే నిల్చుండిపోతాం. మదిలో జాతీయ గీతం మోగుతుంది. ‘జనగణమన’ ఎప్పుడు ఎక్కడ విన్నా ప్రతీ భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుంది. అది దేశంపై ఉన్న ప్రేమ. అటువంటిది వ్యాపారం కోసమని భారత్ వచ్చి ఇక్కడి సంపదను చూసి దురాశచెంది భారతీయుల్ని బానిసలుగా ఎంచి 200 ఏళ్లు పాలించిన తెల్లదొరలను తరమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం.

ఏదేశమైనా భారత్ ను పాలించిందో అదే దేశ పౌరులు అదే బ్రిటన్ లో ఉన్నత స్థానాల్లో కొలువైయ్యారు. అంతేకాదు భారత మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని అయ్యాడు. అలా ఎక్కడ స్థిరపడ్డా భారతీయ మూలాలు మాత్రం వారి మదిలో మెదులుతుంటునే ఉంటాయి.

భారత్ 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు చేసుకుంటున్న వేళ ఏ భారత్ ను అయితే రెండు శతాబ్దాల పాటు పాలించారో అదే బ్రిటీష్ గడ్డపై భారత స్వాతంత్ర్య సంబరాలు మారుమోగాయి. 100మంది సంగీత కళాకారులు భారత జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించారు. బ్రిటన్‌ గడ్డపై ‘జనగణమన వినిపిస్తే ఆ ఉద్వేగం గురించి మాటల్లో చెప్పలేం. దే చేసి చూపించారు భారతీయ స్వరకర్త, మూడు సార్లు ‘గ్రామీ అవార్డు’ విజేత రికీ కేజ్‌. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ‘జనగణమన’ వీడియోను ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా రికీ కేజ్ భావేద్వేగం చెందుతు ‘‘లండన్‌లోని పేరుపొందిన ‘అబే రోడ్‌ స్టూడియోస్‌’( London Abbey Road Studios)లో ‘ది రాయల్‌ ఫిల్హార్మోనిక్‌ ఆర్కెస్ట్రా’(Royal Philharmonic Orchestra)కు చెందిన 100 మంది కళాకారుల బృందంతో జనగణమన గీతాన్ని రికార్డు చేశాను. భారత జాతీయ గీతాన్ని రికార్డ్‌ చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా ఇదే. చాలా అద్భుతంగా వచ్చింది. గీతం చివర్లో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారతీయ స్వరకర్తగా గొప్ప అనుభూతిని పొందా’’ అని పేర్కొన్నారు.