భారత్ పై భారీ దాడికి చైనా ప్లాన్ చేస్తుందా.. 13వేల అడుగుల ఎత్తులో రహస్య స్థావరం

పీవోకే సమీపంలో చైనా స్థావరాలు ఏర్పాటు చేసిందన్న వార్తలపై ఆ దేశ రాయబార కార్యాలయం స్పందించింది. స్థావరాల ఏర్పాటు వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ..

భారత్ పై భారీ దాడికి చైనా ప్లాన్ చేస్తుందా.. 13వేల అడుగుల ఎత్తులో రహస్య స్థావరం

China Secret Military Base Source : @ConflictXtweets

Updated On : July 17, 2024 / 10:19 AM IST

China Military Base: భారతదేశం పై భారీ దాడికి చైనా ప్లాన్ చేస్తుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సరిహద్దుల్లో చైనా వ్యవహరిస్తున్న తీరు. తూర్పు లడఖ్ లో భారత్ పై పైచేయి సాధించలేక పోయిన చైనా.. ఇప్పుడు పీఓకే పై కన్నేసినట్లు తెలుస్తోంది. కజకిస్థాన్ లో 13వేల అడుగుల ఎత్తులో చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని శాటిలైట్ చిత్రాలు ద్వారా వెల్లడిస్తున్నాయి. ఈ ప్రదేశం పీఓకేకు చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో రహస్య సైనిక స్థావరాన్ని నిర్మించి అక్కడ ఫిరంగిని నిక్షిప్తం చేయాలని చైనా భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

Also Read : Oil Tanker Capsizes : సముద్రంలో విషాదం.. 13మంది భారతీయులు గల్లంతు

చైనా ఎప్పుడూ పొరుగు దేశాల భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది. ఈసారి కజకిస్థాన్‌లో పీవోకే సమీపంలో చైనా స్థావరాలు ఏర్పాటు చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఆ వార్తలపై చైనా రాయబార కార్యాలయం స్పందించింది. స్థావరాల ఏర్పాటు వార్తలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంది. వాస్తవానికి మాక్సర్ టెక్నాలజీస్ ఉపగ్రహం నుంచి తీసిన కొన్నిచిత్రాల్లో చైనా రహస్య సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని పేర్కొంది. సైనిక స్థావరం గోడలు, యాక్సెస్ రోడ్లు ఈ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.