Oil Tanker Capsizes : సముద్రంలో విషాదం.. 13మంది భారతీయులు గల్లంతు

ఓడ మునిగిపోయిన సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ..

Oil Tanker Capsizes : సముద్రంలో విషాదం.. 13మంది భారతీయులు గల్లంతు

oil tanker capsized

Oil Tanker Capsizes Off Oman Coast : ఒమన్ సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. ఒమన్ సముద్రంలో సమారు 117 మీటర్ల పొడవున్న చమురును తరలిస్తున్న ఓడ మునిగిపోయింది. ఈ ఓడలో మొత్తం 16 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 13 మంది భారతీయులు, మరో ముగ్గురు శ్రీలంక సిబ్బంది ఉన్నారు. వారంతా గల్లంతయ్యారు. ఒమన్ లోని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ప్రకారం.. ఈ చమురును తరలిస్తున్నఓడ పేరు ప్రెస్టీజ్ ఫాల్కన్ అని చెప్పబడింది. ఈ ఓడలో తూర్పు ఆఫ్రికా దేశం కొమెరోస్ జెండా ఉంది. పోర్టు టౌన్ దుకమ్ కు సమీపంలోని రాస్ మద్రాకకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది.

Also Read : Rain Alert : తెలంగాణలో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 12జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఓడ మునిగిపోయిన సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఓడలో ఉన్న వ్యక్తుల గురించి ఇంకా సమాచారం దొరకలేదు. అయిల్ ట్యాంకర్ మునిగిపోవడానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదంలో గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, సముద్రంలో చమురు ఉత్పత్తులు లీకైన విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.

Also Read : వైసీపీకి షాక్ మీద షాక్..! మున్సిపాలిటీల్లోనూ పాగా వేయాలని టీడీపీ ప్లాన్..!