Shehla Rashid: ఆర్టికల్-370 మీద స్వరం మార్చిన షీలా రషీద్.. కశ్మీర్ ఇప్పుడు సూపర్ ఉందంటూ మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు

ఇంకా ఆమె స్పందిస్తూ "కాశ్మీరీలకు దశాబ్దాలుగా ఉన్న గుర్తింపు సంక్షోభాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఒకే దెబ్బతో ముగించగలిగింది. ఇది ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల వచ్చిన సానుకూల ఫలితమా? బహుశా తరువాతి తరం పోరాటం కావచ్చు" అని అన్నారు

Shehla Rashid: ఆర్టికల్-370 మీద స్వరం మార్చిన షీలా రషీద్.. కశ్మీర్ ఇప్పుడు సూపర్ ఉందంటూ మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు

Shehla Rashid Praises PM Modi: జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్ర విరుచుకుపడుతూ వస్తోన్న యాక్టివిస్ట్ షీలా రషీద్.. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో స్వదేశంతో పాటు విదేశాల నుంచి కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతులు వినిపించాయి. అయితే ఉన్నట్టుండి మోదీ ప్రభుత్వంపై షీలా ప్రశంసలు కురిపించారు.

New Survey On Lies : అబద్ధాలు ఎక్కువగా చెప్పేది అబ్బాయిలేనట.. అమ్మాయిలు కాదట

ఆమెనే కాదు.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా చాలా గొంతుకలే వినిపిస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు లోయలో శాంతి, సుస్థిరతలు నెలకొనడంతో నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నిర్ణయంతో తిట్టిన ప్రజలు కూడా ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక షీలా అభిప్రాయాలు కూడా కాలక్రమేణా మారినట్టే కనిపిస్తోంది. నేడు కాశ్మీర్‌లో మానవ హక్కుల రికార్డు నిరంతరం మెరుగుపడుతుందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కశ్మీరీల గుర్తింపు సంక్షోభాన్ని ఒక్కసారిగా పరిష్కరించిందని ఆమె అన్నారు.

Railway Projects: కీలక మార్గాల్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు

స్వాతంత్ర్య దినోత్సవం రోజునే.. ఆమె తన ట్విటర్(ఎక్స్) హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ.. “ఇది అంగీకరించడం ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ కాశ్మీర్‌లో మానవ హక్కుల రికార్డులో మెరుగుదల కనిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇందుకు దోహదపడ్డాయి. కశ్మీరీ ప్రాణాలను రక్షించడానికి ఈ రెండు సంస్థలు సహాయం చేశాయని నా అభిప్రాయం’’ అని అన్నారు. ఇంకా ఆమె స్పందిస్తూ “కాశ్మీరీలకు దశాబ్దాలుగా ఉన్న గుర్తింపు సంక్షోభాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఒకే దెబ్బతో ముగించగలిగింది. ఇది ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల వచ్చిన సానుకూల ఫలితమా? బహుశా తరువాతి తరం పోరాటం కావచ్చు” అని అన్నారు.

Red Fort: తెల్లకోట ఎర్రకోటలా ఎలా మారింది? చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు

వాతావరణ పరిరక్షణ పట్ల ప్రధాని మోదీ నిబద్ధతపై షెహ్లా ప్రశంసలు కురిపించారు. ఒక పరిశోధనపై మాట్లాడుతూ “ప్రధానమంత్రి తన ప్రసంగంలో చెప్పినట్లు, శక్తి పరివర్తనలో భారతదేశం నిజంగా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. భారతదేశం చారిత్రాత్మకంగా కాలుష్యం కలిగించే దేశం కాదనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రియాశీలక విధానం అభినందనీయం’’ అని షెహ్లా రషీద్ అన్నారు.