Railway Projects: కీలక మార్గాల్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు

ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలోని 35 జిల్లాల్లో జరగనున్న రైల్వే లైన్ల నిర్మణాలు

Railway Projects: కీలక మార్గాల్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు

Union Cabinet: పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని, దేశంలోని కీలక మార్గాల్లో రైల్వే లైన్ బబ్లింగ్ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్ద వాటానే దక్కింది. తాజా నిర్ణయంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు వంటి నగరాల మధ్య ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా, ప్రయాణ సదుపాయం మరింత మెరుగుపడనుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు
* రూ.32,500 కోట్లతో 7 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
* ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలోని 35 జిల్లాల్లో జరగనున్న రైల్వే లైన్ల నిర్మణాలు
* ఏపీలో వివిధ రూట్లలో 374.91 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు
* తెలంగాణలో వివిధ రూట్లలో 433.82 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు
* గుంటూరు-బీబీనగర్ మార్గం డబ్లింగ్‭కు ఆమోదం
* మొత్తం 239 కి.మీ పొడవైన ఈ మార్గం రూ.3,238 కోట్లతో నిర్మించేందుకు కెబినెట్ ఆమోదం
* హైదరాబాద్-చెన్నై మధ్య 76 కి.మీ మేర తగ్గనున్న దూరం, హైదరాబాద్-విజయవాడ మధ్య కూడా తగ్గనుంది
* ఈ మూడెు నగరాల మధ్య పెరగనున్న ప్రయాణికుల రైళ్ల వేగం, గూడ్సు రవాణాకు కూడా ప్రయోజనం
* ముద్కేఢ్ – మేడ్చల్ మార్గం డబ్లింగ్
* మహబూబ్‌నగర్ – డోన్ మధ్య కూడా డబ్లింగ్
, దీంతో హైదరాబాద్ – బెంగళూరు మధ్య 50 కి.మీ మేర తగ్గనున్న దూరం
* కొత్త మార్గం పూర్తయితే వందే భారత్ వంటి రైళ్లకు ఉపయోగకరం
* ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం నుంచి ఖుర్దా రోడ్ మీదుగా నెర్గుండి వరకు 3వ రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం
* కటక్ (నెర్గుండి) నుంచి విశాఖపట్నం (విజయనగరం) మధ్య 3 లైన్ల ద్వారా పెరగనున్న రైల్వే సామర్థ్యం
* సోన్ నగర్ నుంచి అండాల్ మధ్య (ఢిల్లీ-కోల్‌కత్తా మార్గం) 4 వరుసల రైల్వే ప్రాజెక్ట్
* ఇప్పటికే ఉన్న రెండు లైన్లకు అదనంగా మరో రెండు లైన్ల నిర్మాణం. తూర్పు, ఈశాన్య భారతదేశంలోని జనాభాకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం
* ఉత్తరప్రదేశ్‫ లో వివిధ రూట్లలో 190.844 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు
* మహారాష్ట్రలో వివిధ రూట్లలో 49.15కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు
* ఒడిశాలో 184 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు
* బీహార్‭లో 139.246 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు
* ఝార్ఖండ్‭లో 201.608 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు

* పశ్చిమ బెంగాల్‭లో 40.35 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు