Jio Netflix Plan Offer : జియో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ఆఫర్.. రోజుకు 3GB డేటా, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Jio Netflix Plan Offer : రిలయన్స్ జియో యూజర్లకు అదిరే ఆఫర్.. రోజుకు 3GB డేటా ఆఫర్ పొందవచ్చు.. ఈ ప్లాన్ ద్వారా ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ యాక్సస్ చేసుకోవచ్చు.

Jio Netflix Plan Offer : జియో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ఆఫర్.. రోజుకు 3GB డేటా, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Jio Netflix Plan _ Reliance Jio plan comes with 3GB data per day and free Netflix subscription

Jio Netflix Plan Offer : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీ, రిలయన్స్ జియో (Reliance Jio)కు అత్యధిక సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు. జియో తమ లక్షలాది మంది కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లతో ముందుకు వస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లతో ఇతర టెలికం కంపెనీలు సైతం పోటీ పడుతున్నాయి. ఖర్చు విషయానికి వస్తే.. కొన్ని జియో రీఛార్జ్ ప్లాన్‌లు చాలా ఖరీదైనవి. అయితే, కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లు చౌకగా ఉంటాయి. ఈ కంపెనీ పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది.

Read Also : Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 ఈరోజే లాంచ్.. భారత్‌‌లో తయారైన ఈ ఐఫోన్ ధర తక్కువగా ఉంటుందా?

మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. కంపెనీ కొన్ని ప్లాన్‌లు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. అన్నింటిలో మొదటిది, కంపెనీ జియో పోస్ట్‌పెయిడ్ జియో ఫైబర్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించడం ఇదే మొదటిసారి. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఏయే ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జియో రూ. 1,099 రీఛార్జ్ ప్లాన్ :
రిలయన్స్ జియో ఈ రూ. 1,099 ప్లాన్‌లో మొత్తం 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. కంపెనీ కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ ఈ అద్భుతమైన ప్లాన్‌లో మీరు రోజుకు 2GB డేటాను పొందవచ్చు. ఇందులో మీరు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెనిపిట్స్ పొందవచ్చు.

Jio Netflix Plan _ Reliance Jio plan comes with 3GB data per day and free Netflix subscription

Jio Netflix Plan Offer : Reliance Jio plan comes with 3GB data per day and free Netflix subscription

జియో రూ. 1,499 రీఛార్జ్ ప్లాన్ :
రిలయన్స్ జియో కొత్త రూ. 1,499 ప్లాన్ మీకు నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం.. కంపెనీ కస్టమర్లు మొబైల్ లేదా టీవీలో నెట్‌ఫ్లిక్స్ చూడవచ్చు. కానీ ఈ ప్లాన్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే.. ఈ ప్లాన్ రోజుకు 3GB డేటాను అందిస్తుంది. వాస్తవానికి, దేశంలో నెట్‌ఫ్లిక్స్ ప్రాథమిక ప్లాన్ ధర రూ. 199గా ఉంది.

ఈ ప్లాన్ విడిగా కొనుగోలు చేయాలి. మీరు అనేక ఇతర రీఛార్జ్ ప్లాన్‌లను ప్రయత్నించవచ్చు. మీకు ఎక్కువ డేటాతో రీఛార్జ్ ప్లాన్ కావాలంటే.. రీఛార్జ్ చేయగల అనేక ఆఫర్‌లతో కూడిన ప్లాన్‌లను పొందవచ్చు. మీరు కంపెనీ అధికారిక సైట్‌ను విజిట్ చేయడం ద్వారా రీఛార్జ్ ప్లాన్‌ను చెక్ చేయవచ్చు.

Read Also : 2023 Honda CB300F Launch : కొత్త బైక్ కొంటున్నారా? హోండా CB300F 2023 సింగిల్ డీలక్స్ ప్రో వేరియంట్‌.. ధర ఎంతంటే? ఇప్పుడే బుకింగ్ చేసుకోవచ్చు!