Samsung Galaxy M35 5G : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M35 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?

Samsung Galaxy M35 5G Launch : దేశ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ 6జీబీ+ 128జీబీ మోడల్‌కు ప్రారంభ ధర రూ. 19,999, అయితే 8జీబీ+ 128జీబీ, 8జీబీ + 256జీబీ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 21,499, రూ. 24,299కు పొందవచ్చు.

Samsung Galaxy M35 5G : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M35 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?

Samsung Galaxy M35 5G With 50-Megapixel Rear Camera ( Image Source : Google )

Samsung Galaxy M35 5G Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ 5జీ ఫోన్ వచ్చేసింది. బ్రెజిల్‌లో ఆవిష్కరించిన రెండు నెలల తర్వాత భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6.6-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో కంపెనీ ఇంటర్నల్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.

Read Also : Moto G85 5G Sale : భారత్‌లో మోటో G85 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు, సేల్ ఆఫర్లు ఇవే!

ఈ 5జీ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, డాల్బీ అట్మాస్ స్పీకర్లను కలిగి ఉంది. ఈ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ, ఎన్ఎఫ్‌సీ ఆధారిత ట్యాప్ అండ్ పే ఫీచర్‌లతో వస్తుంది. మూడు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో ఈ నెల చివరిలో దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ ధర :
దేశ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ 6జీబీ+ 128జీబీ మోడల్‌కు ప్రారంభ ధర రూ. 19,999, అయితే 8జీబీ+ 128జీబీ, 8జీబీ + 256జీబీ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 21,499, రూ. 24,299కు పొందవచ్చు. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా జూలై 20 నుంచి దేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

కొనుగోలుదారులు రూ. 1000 పరిమిత కాలానికి ఇన్‌స్టంట్ డిస్కౌంట్, శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ కొనుగోలు సమయంలో అన్ని బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్‌లు అదనంగా రూ. 1,000 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ డేబ్రేక్ బ్లూ, మూన్‌లైట్ బ్లూ, థండర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080 x 2,340 పిక్సెల్‌లు) సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ కలిగి ఉంది. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 ఎస్ఓసీ ద్వారా సపోర్టు అందిస్తుంది. ఫోటోల విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా (ఎఫ్/1.8)తో పాటు 8ఎంపీ సెన్సార్‌తో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ (ఎఫ్/2.2) అలాగే 2ఎంపీ మాక్రో (ఎఫ్/2.4) ఉంటుంది.

కెమెరా, సెల్ఫీలు, వీడియో చాట్‌లకు ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 13ఎంపీ కెమెరా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ 6,000mAh బ్యాటరీతో, డాల్‌బై ఆట్మోస్ స్టీరియో స్పీకర్లతో అమర్చింది. ఈ ఫోన్ 5జీ, డ్యూయల్ 4జీ వోల్ట్, వై-ఫై6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ, ట్యాప్ అండ్ పే ఫీచర్‌లతో కూడా వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సైజు 162.3 x 78.6 x 9.1 మిమీ, బరువు 222 గ్రాములు ఉంటుంది.

Read Also : Best Phones in India : ఈ జూలైలో రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!