Bengaluru : ట్రాఫిక్‌లో చిక్కుకున్నవారి ఆకలి కష్టాలు.. ఫుడ్ డెలివరీ చేసిన డోమినోస్ ఏజెంట్లు వీడియో వైరల్

బెంగళూరులో మునుపెన్నడూ లేని విధంగా బుధవారం జనం ట్రాఫిక్‌లో చిక్కుకుని నానా కష్టాలు పడ్డారు. కార్లలో ఉన్నవారికి డోమినోస్ ఏజెంట్లు ఫుడ్ ఆర్డర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Bengaluru : ట్రాఫిక్‌లో చిక్కుకున్నవారి ఆకలి కష్టాలు..  ఫుడ్ డెలివరీ చేసిన డోమినోస్ ఏజెంట్లు వీడియో వైరల్

Bengaluru

Bengaluru : బెంగళూరులో బుధవారం ట్రాఫిక్ చుక్కలు చూపించింది. ఎప్పుడూ లేని విధంగా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికి డోమినోస్ డెలివరీ ఏజెంట్లు ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

Kacheguda-Yesvantpur Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ ఎక్స్‭ప్రెస్ రైలు గురించి 10 ఆసక్తికర విషయాలు

నిముషానికి అంగుళం మేర కదులుతూ రోడ్ల పొడవునా కార్లు..బుధవారం బెంగళూరులో ట్రాఫిక్ జనాలకి మామూలుగా చుక్కలు చూపించలేదు. ఔటర్ రింగ్ రోడ్‌లో ఐదుగంటలకు పైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ట్రాఫిక్ లో చిక్కుకున్న జనం ఆకలితో ఇబ్బంది పడుతూ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. భయంకరమైన ట్రాఫిక్‌లో డెలివరీ ఏజెంట్లకు లైవ్ లొకేషన్ ట్రాక్ చేయడం అంటే సవాల్ గా చెప్పాలి. అయినా సరే డోమినోస్ ఫుడ్ డెలివరీ ఏజెంట్లు సకాలంలో కార్ల వద్దకు తీసుకువచ్చి ఫుడ్ డెలివరీ చేసారు.

AMB Cinemas : కర్ణాటకలో అతిపెద్ద థియేటర్ ఇప్పుడు మహేష్ బాబుది.. AMB సినిమాస్ త్వరలో బెంగళూరులో..

@rishivaths అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘బెంగళూరు ట్రాఫిక్‌లో మా లైవ్ లొకేషన్ ట్రాక్ చేసుకుని ట్రాఫిక్ జామ్‌లో కూడా మాకు ఫుడ్ డెలివరీ చేసారు’ అనే శీర్షికతో ఈ పోస్టు పెట్టారు. బుధవారం బెంగళూరులో ట్రాఫిక్ సాధారణ రోజుకంటే రెండు రెట్లు అధికంగా ఉంది. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్) మద్దతుతో రైతులు, కన్నడ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగళూరులో నిన్న భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.