Pawan Kalyan : న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి.. చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కల్యాణ్

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల విషయంలో నిర్లక్ష్యం తగదని పవన్ కల్యాణ్ కోరారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ సూచించారు.

Pawan Kalyan : న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి.. చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కల్యాణ్

chandrababu Pawan Kalyan

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జుడీషియల్ రిమాండ్ లో  ఉన్న విషయం విధితమే. చంద్రబాబు జైలుకు వెళ్లి నెలరోజులు దాటింది. అయితే, ఆయనకు జైలులో సరియైన సదుపాయాలు కల్పించడం లేదని, చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా చంద్రబాబు ఆరోగ్యం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు జనసేన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని పవన్ అన్నారు.

Read Also : Chandrababu Cases Update : చంద్రబాబు కేసులు.. మరోసారి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల విషయంలో నిర్లక్ష్యం తగదని పవన్ కల్యాణ్ కోరారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ సూచించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు వివిధ సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఆందోళన చెందితే ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయి. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం, చంద్రబాబు విషయంలో ప్రభుత్వం వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని పవన్ కోరారు. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ అన్నారు.

Read Also : Renu Desai : పవన్ కళ్యాణ్‌తో విడాకుల తరువాత.. ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పిన రేణూదేశాయ్..

జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. వైద్యుల నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో ఏసీబీ కోర్టు చంద్రబాబు బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని శనివారం ఆదేశించింది. వెంటనే చర్యలు చేపట్టాలని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కు స్పష్టం చేసింది.