Apple iPhone 12 : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.39వేలు మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Apple iPhone 12 : ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 12 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. పాత ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 39వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. పూర్తివివరాలను ఓసారి లుక్కేయండి.

Apple iPhone 12 : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.39వేలు మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Apple iPhone 12 gets a huge discount during Flipkart Sale

Apple iPhone 12 Discount : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ సొంత బ్రాండ్ ఐఫోన్ 12 ధర భారీగా తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో ఐఫోన్ 15ని లాంచ్ అయినప్పటికీ పాత ఐఫోన్లకు ఇంకా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. అయితే, మీరు ఐఫోన్ కొనాలనుకుంటే ఐఫోన్ 12 ఇప్పటికీ బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఐఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 30వేల లోపు ధరకే ఐఫోన్ 12 మీ సొంతం చేసుకోవచ్చు. మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత ఐఫోన్ విక్రయిస్తే.. ఐఫోన్ 12 ధర మరింత తగ్గించవచ్చు.

Read Also : Apple iPhone 14 Deals : ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డీల్.. రూ.60వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!

ఐఫోన్ 12 ధర ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై 17 శాతం డైరెక్ట్ తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఐఫోన్ అధికారిక ధర రూ.49,900 ఉండగా.. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలో రూ.40,999కి విక్రయిస్తున్నారు. దీనితో పాటు, ధరను మరింత తగ్గించడానికి అనేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఐఫోన్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే తగ్గింపు ధరతో ఉంది. ఐఫోన్ 12 ఇతర వేరియంట్లలో అధిక స్టోరేజ్ వేరియంట్‌ల ధర చాలా ఎక్కువగా ఉంటుందని గమనించాలి.

ఐఫోన్ 12పై మరిన్ని బ్యాంకు ఆఫర్లు :
ఆపిల్ ఐఫోన్ 12పై బ్యాంక్ ఆఫర్లలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఈఎంఐలో ఐఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. మీరు అదనంగా రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. ఇతర ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ విజిట్ చేయొచ్చు. అదనంగా, మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే.. భారీ తగ్గింపును పొందవచ్చు.

Apple iPhone 12 gets a huge discount during Flipkart Sale

Apple iPhone 12 huge discount

ఫ్రాన్స్‌లో ఐఫోన్ 12 అమ్మకాలు నిలిపివేత :
ఈ ఏడాది సెప్టెంబరులో, ఫ్రాన్స్ అధికారులు ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు నివేదిక తెలిపింది. ఈ డివైజ్ అనుమతించిన రేడియేషన్ కన్నా ఎక్కువగా విడుదల చేస్తుంది. అయితే, ఐఫోన్ 12 గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా మల్టీ ఇంటర్‌నేషనల్ సంస్థలచే ధృవీకరించినట్టు ఆపిల్ సమర్థించుకుంది. టెక్ దిగ్గజం ఫ్రాన్స్‌లోని ఐఫోన్ 12 యూజర్ల కోసం ఫ్రెంచ్ రెగ్యులేటర్లు ఉపయోగించే ప్రోటోకాల్‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను కూడా రిలీజ్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విషయానికి వస్తే..
ఫ్రాన్స్‌లోని వినియోగదారుల కోసం ఫ్రెంచ్ రెగ్యులేటర్లు ఉపయోగించే ప్రోటోకాల్‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందిస్తోంది. అయితే, ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ పరిమితులను ఉల్లంఘించినందున దేశంలో ఐఫోన్ 12 అమ్మకాలను నిలిపివేసింది. ఐఫోన్ 12 అక్కడ అమ్ముడవుతుందో లేదో చెక్ చేయడానికి తమ ఏజెంట్లను ఆపిల్ స్టోర్‌లకు పంపుతామని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు.

ఐఫోన్ 12 విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఐఫోన్ 12 ఇప్పటికీ అమ్ముడవుతున్నట్లు తేలితే వినియోగదారులకు విక్రయించిన ఫోన్‌లను రీకాల్ చేస్తామని తెలిపారు. ఐఫోన్ 12 గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, బహుళ అంతర్జాతీయ సంస్థలచే ధృవీకరించినట్టు ఆపిల్ చెబుతోంది. అది నిజమని నిరూపించడానికి ఆపిల్ థర్డ్ పార్టీలు నిర్వహించిన వివిధ ల్యాబ్ రిపోర్టులను కూడా సమర్పించినట్లు కంపెనీ తెలిపింది.

Read Also : Apple iPhone 16 Leak : ఆపిల్ ఐఫోన్ 16 ఫీచర్లు లీక్.. కొత్త డిస్‌ప్లే, చిప్‌సెట్, కెమెరా వివరాలివే..!